షాకింగ్: ఎన్నికల వేల ఏపీకి 500 కోట్లు అక్రమ తరలింపు!  

ఏపీలో ఎలక్షన్స్ కోసం పొరుగు రాష్ట్రం నుంచి ఐదు వందల కోట్లు వచ్చినట్లు సమాచారం. .

Black Money Came To Andhra Pradesh For Elections-andhra Pradesh,april 11 Elections,black Money,election Comession,elections,janasena,tdp,ysrcp

  • ఏపీలో ఎన్నికలు వేడి ప్రారంభం అయిపొయింది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఇప్పటికే ఈ ఎన్నికలలో ఓటర్స్ కి డబ్బు, మద్యం ఎర వేసి ఓట్లు దండుకునే ప్రయత్నాలకి శ్రీకారం చుడుతున్నారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్ధులకి అధినేతల నుంచి కూడా ఖర్చుకి వెనకాడకుండా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్ళడం జరిగింది. ఎలా అయిన గెలుపే లక్ష్యంగా బరిలోకి దుగుతున్న అభ్యర్ధులు ఓటర్ కి వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఒక్కో నియోజక వర్గంలో కోట్ల రూపాయిలని ఎలక్షన్స్ టైంలో మంచినీళ్ళలా ఖర్చు పెట్టబోతున్నారు.

  • ఇదిలా వుంటే ఏపీలో ఎన్నికల ఖర్చు కోసం ఏకంగా 500 కోట్లు వస్తుందని వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కూరగాయల వ్యాన్స్ లో ఈ డబ్బుని రాయలసీమ జిల్లాలో అభ్యర్ధుల కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి 100 కోట్లు, అలాగే రాయలసీమకి 400 కోట్లు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ మొత్తం పక్క రాష్ట్రాల నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇది ఎ పార్టీకి చెందినంది అనే విషయం మాత్రం స్పష్టత లేదు.