Black Kites Birds: ఈరకమైన కైట్స్ గురించి తెలుసా? ఆకాశంలో ఎగురుతూ వాటంతట అవే దిశ మార్చుకుంటాయి!

బ్లాక్ కైట్స్ గురించి మీరు ఏదోఒక సందర్భాలలో వినే వుంటారు.ఇవి సాధారణంగా నాలుగు ఖండాలలో కూడా విరివిగా కనిపించే పక్షులు అని చెప్పుకోవచ్చు.

 Black Kites Birds Can Change Directions In The Sky According To Wind Details,  K-TeluguStop.com

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా విస్తరించివున్న జాతి ఏదన్నా వుంది అంటే అది ఈ రాప్టర్ జాతి పక్షులే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈ పక్షులు సాధారణంగా ముదురు రంగులో ఉంటాయి.

అయితే వాటి తల, మెడ పాలిపోయినట్లు ఉండటం గమనార్హం.రెక్కల ఈకలు అనేవి కారు నలుపులో ఉంటాయి.

డేగల్లో మగవాటి కంటే ఆడ పక్షులు పరిమాణంలో పెద్దగా ఉంటాయి అని చాలామందికి తెలియదు.

ఇక ఇవి ఆకాశంలో ఎగురుతూ వివిధరకాల విన్యాసాలు చేస్తుంటాయి… అచ్చం నేవి డే జరిపినపుడు విమానాలు ఎలా అయితే గాలిలో గింగిర్లు కొడతాయో అలా అని మాట.ఇక వీటి చూపు ఎప్పుడు తీక్షణంగా ఉంటుంది.వేటను పసిగట్టే విధంగా వాటి కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.

ఈ డేగలు యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి.యూరోపియన్, మధ్య ఆసియా పక్షులు చలికాలంలో ఉష్ణమండల ప్రాంతాలకు ఎక్కువగా వలస పోతుంటాయి.

అలాగే ఇవి ఎక్కువగా చిత్తడి నేలలు, నది అంచులు, పొదలు, తీరాలు, గడ్డి భూములు, అడవులలో నుండి పెద్ద నగరాలకు యెగిరి వెళ్తూ ఉంటాయి.

Telugu Black Kites, Change, Kites, Latest, Bird-Latest News - Telugu

వీటిలో మరి ప్రత్యేకత ఏమంటే ఇవి గాలి వీచే దిశని బట్టి వాటి పయనాన్ని మార్చుకుంటూ ఉంటాయి.అందుకే ఎలాంటి ఎదురు గాలులు, ఈదురుగాలులు వీటిని తాకలేవు.బ్లాక్ కైట్స్ వేటాడేటప్పుడు తుప్పలు, చెట్లు ఉన్న ప్రదేశాలలో మాటున ఉండి ఇతర జీవులను వేటాడుతూ ఉంటాయి.

అలాగే వీటి తోక పొడుగ్గా ఉండటం వల్ల కూడా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు వెంటనే దిశ మార్చుకోగలవు.ఈ పక్షులన్నీ దాదాపు నలుపు రంగులో ఉండటం వలన వీటికి బ్లాక్ కైట్స్ అనే పేరు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube