ఇంటింటికీ నల్లా కనెక్షన్.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు నల్లా కనెక్షన్ ఇవ్వనుంది.

 Ap, Governament, Home Water Tap-TeluguStop.com

దీంతో తాగునీటి, రోజువారీ అవసరాలకు సరిపడా నీటిని అందించనుంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గ్రామాల్లో 95.66 ఇళ్లు ఉన్నాయి.వాటిలో 31.93 లక్షల ఇళ్లు నల్లా కనెక్షన్ ను కలిగి ఉన్నాయి.మరో 63.73 లక్షల ఇళ్లకు కొత్త నల్లా కనెక్షన్ ను అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.

గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ (ఆర్ డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వనుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి రూ.10,975 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.ఈ ఖర్చులో సంగం కేంద్ర జలజీవన్ మిషన్ భరించనుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు దశలవారీగా పనులు పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.తొలి విడతగా మొదటి ఏడాదిలో 32 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వనుంది.

రెండో ఏడాదిలో 25 లక్షల ఇళ్లకు, మూడో ఏడాది 5 లక్షల ఇళ్లకు, నాలుగో ఏడాది మిగిలిన ఇళ్లకు తాగునీటి నల్లాలను ఏర్పాటు చేయబోతుంది.మొదటి ప్రాధాన్యతగా మంచినీటి పథకం, ఓవర్ ట్యాంకులతో నీటి సరఫరా పొందుతున్న గ్రామాలకు నల్లా నీరు అందించనుంది.

ఆ తర్వాత మిగిలిన గ్రామాలకు నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube