ప్రతి రోజు 3 కప్పుల బ్లాక్ కాఫీ త్రాగటం మంచిదేనా ?       2018-05-25   23:28:06  IST  Lakshmi P

ప్రతి రోజు మనలో ప్రతి ఒక్కరు టీ,కాఫీలు త్రాగుతూనే ఉంటారు. ఉదయం లేవగానే టీ,కాఫీ త్రాగకపోతే ఏ పనిలోనూ ఉత్సాహం ఉండదు. సరైన మోతాదులో టీ,కాఫీ త్రాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బ్లాక్ కాఫీ త్రాగటం వలన ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి తెలుసుకుంటే తప్పకుండా ప్రతి రోజు బ్లాక్ కాఫీ త్రాగుతారు. ఇప్పుడు ఆ ఉపయోగాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. బ్లాక్ కాఫీ ఎలా తయారుచేయాలో వివరంగా తెలుసుకుందాం.

ఒక గిన్నెల్లో ఒక కప్పు నీటిని తీసుకోని మరిగించాలి. మరుగుతున్న నీటిలో ఒక స్పూన్ కాఫీ పొడి వేసి పది నిముషాలు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత త్రాగాలి. ముఖ్య విషయం ఏమిటంటే పంచదార లేకుండా త్రాగాలి.

ప్రతి రోజు త్రాగటం వలన వయసు రీత్యా వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేసి యాక్టివ్ గా ఉంటారు.

బ్లాక్ కాఫీ త్రాగటం వలన అడ్రినలిన్ విడుదల అయ్యి కొవ్వును కరిగించి అధిక శక్తిని ఇస్తుంది. దాంతో చురుకుగా వ్యాయామం చేయటమే కాకుండా అలసట తగ్గిపోతుంది.

మన శరీరంలో అతి పెద్ద అవయవం లివర్. లివర్ దాదాపుగా మన శరీరంలో 500 పనులను నిర్వర్తిస్తుంది. ప్రతి రోజు బ్లాక్ కాఫీ త్రాగితే లివర్ కి సంబందించిన సమస్యలు రావు. లివర్ ఆరోగ్యంగా ఉండి అన్ని పనులను సక్రమంగా నిర్వర్తిస్తుంది.

ప్రతి రోజు క్రమం తప్పకుండా రెండు కప్పుల బ్లాక్ కాఫీ త్రాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. బ్లాక్ కాఫీ ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది.