అర్ధరాత్రి వీరంగం సృష్టించిన నాగుపాము.. హడలిపోయిన కుటుంబం!

పాములను చుస్తే నిద్రలో కూడా ఉలికి పడి లేస్తాము.అలాంటిది పాము వెంట పడితే ఇంకా భయంతో పై ప్రాణాలు పైనే పోతాయి.

 Black Cobra Entered The House And Created Panic Family Members, Black Cobra, Sna-TeluguStop.com

పాముల్లో నాగు పాము అంటే ఇంకా భయం.ఆ విషపూరితమైన పాము ను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.అలాంటిది నాగు పాము ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టిస్తే ఇక అంతే సంగతులు.పాము పగ పడితే అస్సలు వదిలి పెట్టదు అంటారు.అందుకే నాగు పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కానీ రోజురోజుకూ అడవులు తగ్గిపోతున్న కారణంగా వన్య ప్రాణులు జనావాసానికి వస్తూ ప్రజలను భయపెడుతున్నాయి.

అందుకు కారణం కూడా మనమే.అడవుల్ని నరికేస్తూ ఇల్లును నిర్మించు కుంటున్నాము.

దీని కారణంగా పాములు ఇంట్లోకే జొరబడి నిద్రిస్తున్న సమయంలో వారిని కాటేసి ప్రాణాలను తీస్తున్నాయి.తాజాగా రాజస్థాన్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

అక్కడ ఒక ఇంట్లోకి నాగుపాము జొరబడి అందరిని భయబ్రాంతులకు గురి చేసింది.ఆ ఇంట్లో వారంతా పామును చూసి భయంతో పరుగులు తీశారు.నిద్రించే సమయంలో ఆ కుటుంబ సభ్యులకు ఆ పాము కనిపించింది.ఆ పాము ఆ కుటుంబ సభ్యులను ఏమాత్రం పట్టించు కోకుండా నట్టింట్లోనే పడగ విప్పి బుసలు కొడుతూ అందరిని భయపెట్టింది.

అదే గ్రామానికి చెందిన వన్యప్రాణి అయినా గోవింద్ శర్మ అనే వ్యక్తికి సమాచారం అందించారు.

ఆయన వెంటనే అక్కడికి చేరుకొని ఆ పామును పట్టుకుని అడవిలో సురక్షితంగా వదిలి పెట్టాడు.

ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షాల కారణంగా, ఎండాకాలంలో ఎండలకు తట్టుకోలేక ఇలా పాములు పుట్టలను విడిచిపెట్టి బయటకు వస్తుంటాయి అని తెలిపారు.అంతేకాదు అడవులు తగ్గిపోవడం కూడా ఇందుకు కారణమని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube