కోతులకి ఓ లక్షణం ఉంటుంది.అవి కూడా కాస్తా మనుషులలానే ప్రవర్తిస్తూ ఉంటాయి.
పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల కోతులు స్థానికంగా ఉన్నవారికి జుట్టు దువ్వడం, పేలు చూడటం చేస్తూ ఉంటాయి.ఒకప్పుడు మన పెద్దలు ఈ విషయాలని చాలా సందర్భాలలో చెప్పారు.
అయితే కోతుల మాత్రమే అల జుట్టు సరిచేయడం వంటివి చేస్తాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది.కాని తాజాగా ఒక ఎలుగుబంటి ఓ మహిళా జుట్టు సరిచేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒకప్పుడు ఎలుగుబంట్లు మనుషులని గాయపరిచేవి కాదు.ఇప్పుడు మాత్రం ఆత్మరక్షణ కోసం దాడి చేస్తున్నాయి.
మెక్సికోలో మాంటెర్రీలోని చిపింక్ ఎకలాజికల్ పార్క్‌లో ఎలుగుబంట్లు ఇప్పటికి అక్కడికి వచ్చే టూరిస్ట్ లతో స్నేహంగానే ఉంటాయి.ఓపెన్ గా తిరిగిన కూడా పర్యాటకులకి అవి ఎలాంటి హాని చేయవు.
తాజాగా ఈ పార్క్ లో జరిగిన ఓ సంఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.శనివారం ఓ పర్యాటకుల గుంపు ఈ పార్క్‌ను సందర్శించగా కొన్ని ఎలుగుబంట్లు అటుగా వచ్చాయి.
నిశ్శబ్దంగా ఉంటే వెళ్లిపోతాయని అతని సూచనలు పర్యాటకులంతా ఫాలో అయ్యారు.అదే సమయంలో ఓ ఎలుగుబంటి మహిళ వెనుకకు వచ్చి నిలబడింది.
అనంతరం రెండు కాళ్లపై నిల్చుని ఆమె జుట్టును సరిచేసి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఎలుగుబంటి చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా ట్రెండింగ్ అయిపోయింది.