న్యూయార్క్( New York ) అమెరికా వాణిజ్య రాజధాని.పేరుకు వాషింగ్టన్ రాజధాని నగరమైనా రాజకీయాలకు కూడా న్యూయార్క్ కేంద్ర బిందువు.
ఇక న్యూయార్క్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి.ఇక్కడి వాణిజ్యం, రియల్ ఎస్టేట్ మార్కెట్ల కారణంగా అధిక జీవన వ్యయానికి కారణమవుతోంది.
అలాంటిది ఇటీవల న్యూయార్క్‌కు గుండెకాయ వంటి మాన్‌హాట్టన్‌లో( Manhattan ) ఒక ఆఫీస్ టవర్‌ను దాదాపు 70 శాతం మేర తగ్గింపుతో విక్రయించడం మార్కెట్ నిపుణులను విస్మయానికి గురిచేసింది.ఈ డీల్‌పై భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్( Uday Kotak ) కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కోటక్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా( Nilesh Shah ) పోస్ట్ ప్రకారం.సదరు భవనం చివరిగా 150 మిలియన్ డాలర్లకు విక్రయించబడింది.దీని విలువ గతంలో 500 మిలియన్ డాలర్లుగా వుండేది.అంటే దాదాపు 70 శాతం తగ్గింపుతో ఈ భవంతి అమ్ముడైంది.222 బ్రాడ్ వే వద్ద వున్న 778 వేల చదరపు అడుగుల ఈ టవర్‌ను 150 మిలియన్ డాలర్లకు విక్రయించారు.ఈ భవనాన్ని 2014లో 500 మిలియన్ డాలర్లకు విక్రయించారు.
దీనిని బట్టి న్యూయార్క్ కూడా రియల్ ఎస్టేట్( Real Estate ) పరంగా భారీ విధ్వంసాన్ని చవిచూస్తోందని షా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
దీనిపై ఉదయ్ కోటక్ స్పందించారు.న్యూయార్క్‌లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ధర చదరపు అడుగుకు రూ.16000గా వుందన్నారు.అంటే న్యూయార్క్ ప్రాపర్టీ ధర .ముంబైలోని హైప్రొఫైల్ ఏరియా బాంద్రా కుర్లాలో( Bandra Kurla ) వున్న రేటులో సగం కంటే తక్కువ అని ఉదయ్ పేర్కొన్నారు.దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.బోరివాలితో పోలిస్తే న్యూయార్క్‌లో ప్రాపర్టీ ధర సగం కంటే తక్కువ అని, ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీ చదరపు అడుగుకు 28000 నుంచి 29000 వుందన్నారు.
ముంబై.( Mumbai ) భారతదేశ ఆర్ధిక రాజధాని.ఉపాధి, ఉద్యోగం, వ్యాపారాల కోసం ఈ నగరానికి భారీగా వలసలు వుంటాయి.దీంతో ఇక్కడ ఇళ్లు, ఆఫీస్ స్పేస్‌కు అధిక డిమాండ్ వుంటుంది.నైట్ ఫ్రాంక్ ప్రకారం.లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరల పెరుగుదలలో ప్రపంచంలోని 46 నగరాల్లో ముంబై 4వ స్థానంలో వుంది.అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికంలో 13 భారతీయ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఏడాది ప్రాతిపదికన 18.8 శాతం.క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 3.97 శాతం పెరిగాయి.