బీజేపీ పరువు తీసిన స్కూటీలు  

Bjp Scooty Yojana-

బిజెపి ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, అందుకే వారి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి మేలు చేస్తున్నారని ఆ విధంగానే బాలికలు, చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే మహిళలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకాన్ని ప్రారంభించారని ప్రచారం జరిగింది.ఈ పథకంలో భాగంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇవ్వబోతున్నారని దీనికోసం సర్కార్ యోజన వెబ్సైట్లోకి వెళ్లి స్కూటీ యోజన దరఖాస్తును నింపాలని, దీని నిమిత్తం పదవ తరగతి మార్కుల జాబితా, రేషన్ కార్డు, ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎల్ ఎల్ ఆర్ లైసెన్స్ కూడా దరఖాస్తుతోపాటు జత చేయాలని, ఈ నెల 30వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుందని, ఒక కుటుంబంలో లో ఒకరికి మాత్రమే అవకాశం ఉందని 18 నుంచి 40 సంవత్సరాల లోపు మహిళలందరూ ఈ పథకానికి అర్హులని తదితర వివరాలతో కొద్దీ రోజులుగా సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపు ల్లో స్కూటీ యోజన పథకం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిపోయింది...

Bjp Scooty Yojana--Bjp Scooty Yojana-

ఈ స్కూటీ యోజన పథకం ద్వారా ఉచితంగా స్కూటీ వస్తున్న ఆశతో పెద్ద ఎత్తున మహిళలు ఈ సేవ కేంద్రాల చుట్టూ, లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీస్ ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు.అయితే ఇటువంటి పథకం ఏది లేదని చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు.దీనికి కారణం కూడా ఉంది.

కొద్ది రోజుల క్రితం తమిళనాడు ప్రభుత్వం బాలికలకు స్కూటీలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది.దీనికి ప్రధానమంత్రిని ఆహ్వానించారు.అక్కడ మోదీ అది బీజేపీ పథకమే అన్నట్లుగా ప్రసంగించారు..

Bjp Scooty Yojana--Bjp Scooty Yojana-

దీంతో అసలు ఈ పథకాన్ని ప్రారంభించింది మోదీనే అని, ఇదే ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకం అని అంతా నమ్మేశారు.ఇదే వైరల్ కూడా అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఈ పథకం కోసం ఎంక్వైరీ చేసే మహిళల సంఖ్య పెరిగిపోవడం, నాయకులూ, ఆఫీస్ ల చుట్టూ తిరగడం బీజేపీ నేతలను దీనిపై నిలదీస్తుండటంతో అసలు ప్రధానమంత్రి స్కూటీ యోజన అనే పథకమే లేదని ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీ నేతలు చెప్పడం మొదలుపెట్టారు.సోషల్ మీడియాలో ప్రచారంతో ప్రజలు మోసపోవద్దని చెబుతూ తలలుపట్టుకుంటున్నారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదేనేమో.