ప‌క్కా ప్లాన్ తో బీజేపీ వ్యూహం.. ప్ర‌ధాని రాక‌తో భారీగా చేరిక‌ల‌కు స్కెచ్

తెలంగాణ‌లో బీజేపీ హైక‌మాండ్ ప‌క్కా ప్లాన్ తో పావులు క‌దుపుతోందా.అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు.

 Bjp's Strategy With Pakka Plan  Sketch For Massive Additions With The Arrival Of-TeluguStop.com

ప్ర‌ధాని మోడీ తెలంగాణ రాక‌తో స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి.మునుపెన్న‌డూ లేని విధంగా వ్యూమ ర‌చ‌న‌ల‌తో పావులు క‌దుపుతున్నారు.

తెలంగాణ‌లో పార్టీ బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో చావో రేవో తేల్చుకోవ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.దీంతో అసంతృప్తుల‌పై క‌న్నేసింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని స‌మ‌క్షంలో భారీగా బ‌డా నేత‌ల చేరిక‌ల‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు నుంచే బీజేపీ నేతలు తెలంగాణ దండయాత్ర చేస్తున్నారు.

అన్ని రాష్ట్రాల నేతలు ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగుతున్నారు.నేరుగా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తున్నారు.పనిలో పనిగా ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులపై గురి పెడుతున్నారు.3న హైదరాబాద్ లో జరగనున్న బహిరంగ సభలో ప్ర‌ధాని సమక్షంలో పార్టీలో చేర్పించేలా చర్చలు జరుపుతున్నారు.

అయితే ఇప్ప‌టికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లలో ఉన్న అసంతృప్త నేత‌ల‌ జాబితాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతికి అందినట్లు స‌మాచారం.అయితే ఆ లిస్టులో ప్ర‌ధానంగా కొంత‌మంద‌ని లిస్ట్ అవుట్ చేసి ఏఏ హామీల‌తో చేర్చుకోవాలో ప‌క్కా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

క‌నీసం ఒక్కో జిల్లా నుంచి ఒకరిద్దరు కీలక నేతల‌ను పార్టీలో చేర్చుకోవ‌డానికి చూసుకుంటున్నారట.ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కనీసం ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ ల వేట‌లో ఉన్నార‌ట‌.ఇక ఈ లిస్ట్ లో టీఆర్ఎస్ నుంచి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిడమర్తి రవి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, కోరం కనకయ్య, తీగల కృష్ణారెడ్డి తదితర కీలక నేతల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లు స‌మాచారం.

Telugu Bandi Sanjay, Jp Nadda, Pidamarthy Ravi, Pm Modi, Telangana-Political

ఇక కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి, పీజేఆర్ కొడుకు విష్ణు వర్దన్ రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మ‌రో ముగ్గురు బ‌డా నేతలతో కూడా చర్చలు జరుపుతోంద‌ని స‌మాచారం.ఈ ప్లాన్స్ స‌క్సెస్ అవుతే మోడీ స‌మ‌క్షంలో చేర్చించ‌డానికి సిద్దం చేస్తున్నారు.దీంతో టీఆర్ఎస్ కి ప్ర‌త్యామ్నాయం త‌మేన‌ని నిరూపించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అయితే చేరిక‌లు ఇప్పుడే జ‌ర‌గాల‌ని.ఇలా జ‌రిగితేనే పార్టీకి మంచి జోష్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube