నాగార్జునా సాగ‌ర్‌లో బీజేపీ ప‌రిస్థితి ఘోర‌మే... ఆ పార్టీదే గెలుప‌న్న స‌ర్వే..!

దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు అయిపోయాయి.బీజేపీ పై చేయి సాధించింది.

 Bjp's Situation In Nagarjuna Sagar Is Dire That Party Won The Survey ,telangana,-TeluguStop.com

ఇప్పుడు అంద‌రి దృష్టి నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక మీదే ఉంది.ఈ ఉప ఎన్నిక కారు పార్టీలో క‌ల‌వ‌రం రేపుతోన్న మాట వాస్త‌వం.

ఇక్క‌డ పోటీ టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య ఉంటుందా ?  లేదా టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య ఉంటుందా ? అన్న‌దే ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్‌.దుబ్బాక‌, గ్రేట‌ర్ ఫ‌లితాలు క‌మ‌లం పార్టీలో ఎంతో ఉత్సాహం నింపుతుండ‌గా సాగ‌ర్‌లో మాత్రం ఆ పార్టీ ప‌ప్పులు ఉడికేలా లేవు.

ఆ మాట‌కు వ‌స్తే ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ఏ ఎన్నిక జ‌రిగినా బీజేపీకి డిపాజిట్ రావ‌డ‌మే గొప్ప‌.అస‌లు హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మూడు వేల ఓట్లు కూడా రాలేదు.

ఇక ఇప్పుడు ఆంధ్రా స‌రిహ‌ద్దులో.అది కూడా కాషాయ ద‌ళానికి ఏ మాత్రం ప‌ట్టులేని చోట జ‌రుగుతోన్న ఉప ఎన్నిక కావ‌డంతో బీజేపీ ప‌రిస్థితి ఏంద‌న్న‌ది స‌హ‌జంగానే ఆస‌క్తి రేపుతోంది.

అస‌లు సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఓట‌రు తీర్పు ఎలా ఉండ‌బోతోంద‌ని ఇప్ప‌టికే బీజేపీ అక్క‌డ ఓ స‌ర్వే చేయించుకుంద‌ట‌.అయితే ఈ సర్వేలో బీజేపీకి 5-6శాతం మాత్రమే ఓట్లు వచ్చాయట.

 అందుకే అలెర్ట్ అయిన బీజేపీ వాళ్లు  ఇటీవల ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారట.

Telugu Candi, Congress, Dubbaka, Dubbakan, Ghmc, Jaina Reddy, Latest, Nagarjuna

టీఆర్ఎస్ – కాంగ్రెస్ సాగ‌ర్ ఉప ఎన్నిక కోసం కుమ్మ‌క్కు అయ్యాయ‌ని.త‌మ‌ను ఓడించ‌డానికి ముందే చేతులు క‌లిపేశార‌ని అక్క‌డ బీజేపీ స‌రికొత్త ప‌ల్ల‌వి అందుకుంద‌ని అంటున్నారు.గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి కేవ‌లం 5 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఇప్పుడు ఎంత క‌ష్ట‌ప‌డినా మ‌రో ఒక‌టి రెండు శాతం ఓట్లు పెర‌గ‌డం మిన‌హా చేసేదేం లేదంటున్నారు.ఇక బీజేపీ చేయించిన స‌ర్వేలో కూడా టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కే 2 శాతం ఓట్లు ఎక్కువ వ‌స్తాయ‌ని తేలింద‌ట‌.

ఇక ఇటు జ‌నా రెడ్డి సైతం ఇక్క‌డ కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్ కొత్త పీసీసీ అధ్య‌క్షుడికి పోతుంద‌ని.అందుకే ఇక్క‌డ ఉప ఎన్నిక త‌ర్వాత కొత్త పీసీసీ అధ్య‌క్షుడి పేరు ప్ర‌క‌టించ‌మ‌ని సూచించార‌ట‌.

మ‌రి అధిష్టానం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో ?  గాని మొత్తానికి సాగ‌ర్‌లో క‌మ‌లానికి షాక్ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube