కేసీఆర్‌తో మోడీ థర్డ్‌ ఫ్రంట్‌ గురించి ఏమన్నారంటే..!       2018-06-16   02:50:39  IST  Bhanu C

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలో చక్రం తిప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం కేంద్రం స్థాయిలో థర్డ్‌ ఫ్రంట్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేసిన విషయం తెల్సిందే. కాంగ్రెస్‌, బీజేపీ ఏతర కూటమి కోసం ఇప్పటికే పు ప్రాంతీయ పార్టీల నాయకులతో కేసీఆర్‌ చర్చలు జరిపిన విషయం తెల్సిందే. దాదాపు ఆరు నెలలుగా కేసీఆర్‌ కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయం అంటూ జాతీయ స్థాయి మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో హస్తినకు వెళ్లిన కేసీఆర్‌ ప్రధాని మోడీని కలవడం జరిగింది.

కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీని కలవడం ఇదే ప్రథమం. అందుకే అందరి దృష్టి కూడా ఈ భేటీపై పడటం జరిగింది. తెలంగాణ కోసం నిధులు అడగటంతో పాటు హైకోర్టు విభజన మరియు ఏపీ భవన్‌ విభజన విషయమై ప్రధాని మోడీ దృష్టికి కేసీఆర్‌ తీసుకు వెళ్లాడు. కేసీఆర్‌ ప్రస్థావించిన సమస్యలను సావదానంగా విన్న ప్రధాని మోడీ అన్నింటికి సరే అన్నట్లుగా, చూద్దాం అన్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరంగా ప్రాజెక్ట్‌ గురించి మోడీకి ప్రత్యేకంగా కేసీఆర్‌ వివరించారని టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. 20 వేల కోట్లను కాళేశ్వరం కోసం కేంద్ర కేటాయించాలని కేసీఆర్‌ కోరినట్లుగా తెలుస్తోంది.

ఈ సమయంలోకే కేసీఆర్‌తో మోడీ థర్డ్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడినట్లుగా సమాచారం అందుతుంది. అనధికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ వివరాలను మోడీ అడిగి తెలుసుకున్నారని, మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని, ప్రాంతీయ పార్టీలకు బీజేపీతో ఉంటే లాభం చేకూరుతుందని, ఎన్డీయే కూటమిలోకి మీరు రావాలంటూ మోడీ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. గతంలో మోడీతో కేసీఆర్‌ భేటీ అయిన సమయంలో ఎన్డీయే కూటమిలోకి టీఆర్‌ఎస్‌ వెళ్తుందని అంతా భావించారు.

గతంలో కేసీఆర్‌ ఎన్డీయే కూటమిలోకి వెళ్లాలని భావించిన సమయంలో మోడీ అండ్‌ అమిత్‌షాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాని ఇప్పుడు అమిత్‌షా ప్రత్యేకంగా కేసీఆర్‌తో మాట్లాడినా కూడా ప్రయోజనం లేదు. 2019 ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్దాం అంటూ మోడీ కూడా కేసీఆర్‌తో ఇండైరెక్ట్‌గా అన్నట్లుగా టీఆర్‌ఎస్‌ వర్గాల వారు చెబుతున్నారు. కాని కేసీఆర్‌ మాత్రం మూడవ ఫ్రంట్‌తోనే ముందుకు వెళ్లాలని సన్నాహాలు చేస్తున్నాడు. కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ విషయంలో సీరియస్‌గా ఉంటే మోడీ ఖచ్చితంగా రాష్ట్రంకు రావాల్సిన నిధులను అడ్డుకునే అవకాశం ఉందని, ఇప్పట్లో హైకోర్టు విభజన మరియు ఏపీ భవన్‌ విజన జరగదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.