సోషల్ మీడియాపై బీజేపీ భారీ ఫోకస్... అసలు కారణమిదే?

Bjps Huge Focus On Social Media What Is The Real Reason

తెలంగాణలో బలపడడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీ అనేది లేని పరిస్థితుల్లో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

 Bjps Huge Focus On Social Media What Is The Real Reason-TeluguStop.com

అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం ఇప్పటికిప్పుడు కార్యాచరణ మొదలు పెట్టినా బలమైన క్యాడర్ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది.

అందుకే సోషల్ మీడియాపై బీజేపీ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది.అయితే సోషల్ మీడియాను ప్రస్తుతం ఎక్కువగా యువత ఉపయోగిస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కూడా యువతతో బీజేపీ ఇంటరాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఇక తెలంగాణ ఉద్యమంలో కెసీఆర్ కు యువత ఎలా ఉపయోగపడ్డారో ప్రస్తుతం బీజేపీ కూడా అదే వ్యూహాన్ని అవలంబిస్తోంది.

 Bjps Huge Focus On Social Media What Is The Real Reason-సోషల్ మీడియాపై బీజేపీ భారీ ఫోకస్… అసలు కారణమిదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతానికి చాలా వరకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లాంటి అస్త్రం భవిష్యత్తులో ప్రయోగించబోతున్నట్టు తెలుస్తోంది.అయితే ఇటు సోషల్ మీడియా ఇప్పటి వరకు గెలిచిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పరిస్థితుల్లో ఇక రానున్న రోజుల్లో సోషల్ మీడియా దాడిపైనే బీజేపీ ఐటీ సెల్ విభాగం దృష్టి కేంద్రీకరించే అవకాశం వందకు వంద శాతం ఉంది.

అయితే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశం ఉంది.గతంతో పోలిస్తే టీఆర్ఎస్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నవనేది మాత్రం సుస్పష్టం.అయితే టీఆర్ఎస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ముందుకెళ్తోంది.అయితే ప్రస్తుతం ప్రజల్లో టీఆర్ఎస్ పాలన పట్ల స్పందన ఎలా ఉందనేది కెసీఆర్ సమాచారం ఉంటుంది కావున దానికనుగుణంగా కెసీఆర్ నడుచుకునే అవకాశం ఉంది.

మరి బీజేపీ వ్యూహాలు ఏమేరకు ఫలితాలిస్తాయనేది చూడాల్సి ఉంది.

#@BJP4Telangana #@trspartyonline #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube