40 సీట్లపై బీజేపీ కన్ను.. టీడీపీతో జతకట్టాలని కమలనాథుల ప్లాన్

అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.2019 ఎన్నికల్లో ఉప్పు, నిప్పులా కనిపించిన టీడీపీ, బీజేపీలు ప్రస్తుతం పాలు, నీళ్లు తరహాలో కలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ జతకడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఏపీ సంగతి ఎలా ఉన్నా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం బీజేపీ తెలుగుదేశం పార్టీ మద్దతు కూడగట్టాలని భావిస్తోంది.

 Bjp's Eye On 40 Seats  Bjp Leaders Plan To Tie Up With Tdp In Telangana Telangan-TeluguStop.com

ఇటీవల అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆహ్వానించారు.అటు రాష్ట్ర పతి ఎన్నికల్లో టీడీపీని కలుపుకొనిపోయేందుకు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కిషన్‌రెడ్డి కృషి కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారని తెలుస్తోంది.అయితే టీడీపీతో బీజేపీ నేతల వ్యూహం వెనుక తెలంగాణ రాజకీయం దాగి ఉందని పలువురు భావిస్తున్నారు.

తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం నేతలు లేకపోయినా క్యాడర్ మాత్రం అలాగే ఉంది.తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో టీడీపీకి సానుకూల ఓటు బ్యాంకు ఉంది.2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున చాలా మంది విజయం సాధించారు.అయితే అనివార్య కారణాల వల్ల తెలంగాణలో టీడీపీ బలహీనపడిందనేది జగమెరిగిన సత్యం.

Telugu Kishan Reddy, Telangana, Telengana, Telugu Desam, Trs-Telugu Political Ne

ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ క్యాడర్‌ను అడ్డం పెట్టుకుని ఆ పార్టీతో చేతులు కలిపితే వచ్చే ఎన్నికల్లో తమకు 30 నుంచి 40 స్థానాల్లో గెలుపు ఖాయమని కమల నాథులు అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో తెలంగాణలో అధికారంలో రావడానికి మార్గం ఏర్పడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.హైదరాబాద్‌లో ఇప్పటికీ సెటిలర్లు కీలక ఓటు బ్యాంకుగా పలు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.ఇటీవల ఎన్టీఆర్ జయంతిని నగరంలోని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు.అన్నదానాలు కూడా చేపట్టారు.టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే టీడీపీతో చెలిమి చేయక తప్పదని.

అందుకే కిషన్‌రెడ్డిని బీజేపీ అధిష్టానం రంగంలోకి దించిందని పలువురు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube