ఆ ఎంపీలు ఇంతపని చేస్తున్నారా ? టీఆర్ఎస్ భయం అదేనా ?  

Bjp Mp Plan To Get Win Municipal Corporation Elections-

టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గతంలో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ పథకం ద్వారా పక్క పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుని తెలంగాణాలో తామే బలవంతులం అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ.ఇప్పుడు అదే ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని చూసి బెంబేలెత్తిపోతోంది.అయితే ఇప్పుడు అదే అస్త్రాన్ని టీఆర్ఎస్ మీద బీజేపీ ప్రయోగించడం టీఆర్ఎస్ అగ్రనాయకులు మింగుడుపడడంలేదు...

Bjp Mp Plan To Get Win Municipal Corporation Elections--Bjp Mp Plan To Get Win Municipal Corporation Elections-

ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల మీద గెలిచిన యంగ్ ఎంపీలు ఈ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.టీఆర్ఎస్ మీద పదునైన విమర్శలు చేస్తూ పార్టీలో ఉన్న కీలక నాయకులను తమ వైపు లాగేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు.

Bjp Mp Plan To Get Win Municipal Corporation Elections--Bjp Mp Plan To Get Win Municipal Corporation Elections-

ఉత్తర తెలంగాణలో బలమైన టీఆర్ఎస్ ను అంతే బలంగా ఎదుర్కొంటున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లు క్షేత్ర స్థాయిలోకి బీజేపీని బలోపేతం చేయడంలో నిమగ్నమయిపోయారు.తమ పార్లమెంట్ పరిధిలో మొత్తం టీఆర్ఎస్ ఎమ్యెల్యే లు ఉన్నా ప్రొటోకాల్ ప్రకారం ఎంపీలుగా వీరే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతూ టీఆర్ఎస్ కు తలపోటుగా మారారు.

అంతే కాదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్లు ఆశించి భంగపడ్డ అసంతృప్తులను గుర్తించి బీజేపీలో చేర్చుకునే పనిలో నిమగ్నం అయ్యారు.తాజాగా రామగుండం మాజీ ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన సోమారపు సత్యనారాయణను ఈ ఇద్దరు ఎంపీలు అరవింద్, బండి సంజయ్ లు బీజేపీలో చేర్చుకుని పెద్ద షాకే ఇచ్చారు..

రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సోమారపుతో కలిసి రామగుండంపై బీజేపీ జెండాను ఎగుర వేయాలని వీరిద్దరూ పెద్ద ప్లానే వేసారట.స్థానికంగా బలమైన నాయకుడిగా ముద్రపడ్డ సోమారపు సత్యనారాయణ తనను టీఆర్ఎస్ పట్టించుకోకపోవడంపై కలత చెంది పార్టీ మారానని చెప్పుకుంటున్నారు.

ఇక మిగిలిన అసంతృప్తులను కూడా గుర్తించి వారిని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.టీఆర్ఎస్ పార్టీకి ఉత్తర తెలంగాణాలో బలమైన నాయకులే ఉన్నారు.అయితే పార్టీ మీద అసంతృప్తి ఉన్నవారు కూడా అదే రేంజ్ లో ఉండడంతో వీరంతా బీజేపీ కండువా కప్పేసుకుంటారేమో అన్న భయం ఇప్పుడు టీఆర్ఎస్ పెద్దల్లో కనిపిస్తోంది...