తెలంగాణాలో వారు ఆంధ్రాలో వీరు ! ఆ కులాలపై బీజేపీ కన్ను ?  

Bjp Focus On Telangana And Andhrapradesh-bjp,komati Reddy Rajagopal Reddy,narendra Modi,revanth Reddy

కేంద్ర అధికార పార్టీ బీజేపీ దేశంలోనే అతి శక్తివంతమైన, బలమైన పార్టీగా అవతరించాలని చూస్తోంది. దీనిలో భాగంగానే తాము ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో గుర్తించి అక్కడ బలపడేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర,తెలంగాణల్లో పార్టీని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టిపెట్టింది..

తెలంగాణాలో వారు ఆంధ్రాలో వీరు ! ఆ కులాలపై బీజేపీ కన్ను ?-Bjp Focus On Telangana And Andhrapradesh

తెలంగాణాలో రెడ్డి, ఆంధ్రాలో కమ్మ సామజిక వర్గాలను ఆకర్షించి ఆ సామజిక వర్గాలకు చెందిన బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారట. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ బాగా బలహీనం పడడం, ప్రజాధారణ తగ్గడంతో ఆ పార్టీలో ఉన్న నాయకులంతా ప్రత్యామ్న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే వారికి ఆప్షన్ గా కనిపిస్తున్నాయి. ఇటువంటి వారిని గుర్తించి కాషాయ కండువా కప్పాలని బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. అదీ కాకుండా తెలంగాణలో అధికారంలో ఉన్న వెలమలకు, రెడ్లకు మధ్య చాలా కాలంగా రాజకీయ వైరాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు వెలమల దొరతనాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటివరకు తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడుతున్న దశలో బిజేపీయే ప్రత్యామ్నయంగా భావిస్తోంది. దీంతో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ అగ్ర నాయకులు పూర్తి స్థాయిలో ఇక్కడ దృష్టిసారించారు..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకులు డి.కే అరుణ బిజేపీలో చేరారు.

కాంగ్రెస్ కు చెందిన మరో నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కూడ బిజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. అలాగే తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏపీ విషయానికి వస్తే ఇక్కడ బలమైన సామాజిక వర్గంగా పేరున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఆకర్షించేందుకు బీజేపీ అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం టీడీపీనే అంటిపెట్టుకుని ఉంది. ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో కమ్మ సామాజిక వర్గం నేతలు బిజేపీ వైపు చూస్తున్నారు..

టీడీపీలో కీలకంగా ఉన్న నాయకులను బీజేపీ లో చేర్చే బాధ్యతలను ఇప్పటికే దగ్గుపాటి పురందరేశ్వరి, సూచనా చౌదరి వంటి నాయకులకు బీజేపీ అధిష్టానం అప్పగించినట్టు తెలుస్తోంది.