వాజ్ పేయ్ వైయస్సార్ ! పోలవరం లో ఉండేదెవరు ?

వాజ్ పేయ్ , వైయస్సార్ ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఇద్దరూ గొప్ప వ్యక్తులే.ఒకరు దేశ ప్రధానిగా, మచ్చ లేని వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే, మరొకరు పేదల పాలిట పెన్నిధి గా, మచ్చ లేని వ్యక్తి గా, డైనమిక్ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Bjp Ysrcp War On Statue Issue About Pallavaram Project, Ys Rajashekar Reddy, Vaj-TeluguStop.com

ఇద్దరు నేతలు భౌతికంగా దూరమయ్యారు.కానీ ఈ ఇద్దరు నేతల ప్రస్తావన రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చింది.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారం మొదటి నుంచి అనేక వివాదాలకు కేంద్రంగా ఉంది.వీలైనంత తొందరగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఆ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ భావిస్తుండగా , ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేది తామే కాబట్టి ఆ క్రెడిట్ తమకే దక్కాలనేది బిజెపి నేతల వాదన.

ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భారీ విగ్రహాన్ని పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసేందుకు  ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, అక్కడ మాజీ ప్రధాని వాజ్ పేయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బిజెపి గట్టిగానే పట్టుబడుతోంది.దీంతో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, వాజ్ పెయ్ ఈ ఇద్దరిలో ఎవరి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

అసలు పోలవరం ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చిందంటే దానికి ప్రధాన కారకుడు రాజశేఖర్ రెడ్డి అనేది వైసిపి వాదన అందుకే ఇక్కడ 125  అడుగుల ఎత్తున్న వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఇక్కడ వాజ్ పే య్ విగ్రహం పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Telugu Somu Veerraju, Ysr Congress-Political

పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోంది కాబట్టి, బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకుడు అయిన వాజ్ పేయ్ విగ్రహం పెట్టడమే సరైనదే అని,  ఆ పార్టీ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది.కానీ పోలవరం ప్రాజెక్టుకు వాజ్ పేయ్ కు ఉన్న సంబంధం ఏమిటనేది బిజెపి నేతలు ఎక్కడ ప్రస్తావించడం లేదు.కానీ వైసిపి మాత్రం పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టింది రాజశేఖరరెడ్డి అని , ఆయన విగ్రహం ఉండటం సరైనదని ఇక్కడ ఆయన విగ్రహం తప్ప మరెవరికీ స్థానం లేదని గట్టిగా చెబుతోంది.బీజేపీ మాత్రం అవసరమైతే కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్టు వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇందులో రాజీ పడేది లేదు అని గట్టిగానే చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య ఈ వివాదం నడుస్తోంది ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారో ? పోలవరంలో ఎవరు విగ్రహాన్ని జనాలు చూడబోతున్నారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube