తెర‌మీద జ‌గ‌న్‌.. తెర‌వెనుక బీజేపీ.. ఏం జ‌రుగుతోందంటే..!

ఏపీ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు… ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దూకుడును అంచ‌నా వేస్తున్న‌వారు.ఓ కీల‌క విష‌యాన్ని తెర‌మీద‌కి తెచ్చారు.

 Bjp Playing Politics Against Ycp,bjp,ysrcp,jagan Mohan Reddy,narendra Modidelhi-TeluguStop.com

న్యాయ వ్య‌వ‌స్థ‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో జ‌గ‌న్ వ్య‌వ‌హరించ‌డంపై వారు ఓ విష‌యాన్ని వెలుగులోకి తెచ్చారు.ఇంత సాహ‌సం, ఇంత ధైర్యం, ఇంత దూకుడు జ‌గ‌న్‌కు ఏమాత్ర‌మూ లేవ‌ని.

అంటున్నారు.అంతేకాదు.

కొన్ని కేసులు ఆయ‌న చుట్టూ అలుముకున్న నేప‌థ్యంలో ఇలా న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న టార్గెట్ చేస్తారంటే.ఎవ‌రూ విశ్వ‌సించే ప్ర‌య‌త్నం చేయ‌లేర‌ని చెబుతున్నారు.

దీనివెనుక బీజేపీ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని చెబుతున్నారు.

బీజేపీ పెద్ద‌లు తాము ఏదైనా చేయాల‌ని అనుకుంటే.

దానికి అనుకూలంగా ఉండే నాయ‌కుల‌ను, వ్య‌వ‌స్థ‌ల‌ను వినియోగిస్తారు.ఈ విష‌యంలో త‌మిళ‌నాడు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.

అదేస‌మయంలో బిహార్‌లోనూ నితీష్‌ను త‌మవైపు తిప్పుకొని ప్ర‌భుత్వంలోకి వ‌చ్చారు.ఇక‌, ఇప్పుడు వారి దృష్టి న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప‌డింద‌ని చెబుతున్నారు.

త్వ‌ర‌లోనే సుప్రీం కోర్టుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని నియ‌మించే ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది.ఈ క్ర‌మంలో ఇప్పుడున్న నేప‌ధ్యంలో ఏపీకి చెందిన సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి, జ‌స్టిస్‌ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ ప్ర‌మోష‌న్ రేసులో ఉన్నారు.

త‌దుప‌రి సీజే ఆయ‌నే అవుతారు.

అయితే, ఈ విష‌యంలో ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే.

త‌మ‌కు అనుకూలంగా ఉండే న్యాయ‌మూర్తిని ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మించుకునేందుకు బీజేపీ పెద్ద‌లు పావులు క‌దుపుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.అంటే.

జ‌స్టిస్ ర‌మ‌ణ‌పై బుర‌ద జ‌ల్ల‌డ‌మో.ఆరోప‌ణ‌లు రావ‌డ‌మో చేస్తే.

ఆయ‌న త‌ప్పుకొంటే.త‌దుప‌రి వ‌రుస‌లో జ‌స్టిస్ రోహింట‌న్ ను వ‌స్తారు.

ఈయ‌న ప్ర‌మాణం చేసినా.కేవ‌లం నాలుగు మాసాలే ప‌ద‌విలో ఉంటారు.

త‌ర్వాత వ‌రుస‌లో ఉన్న జ‌స్టిస్ ఉమేష్ ల‌లిత్ కు ఛాన్స్ ఇవ్వాల‌ని కేంద్రం పెద్ద‌లు భావిస్తున్నార‌ట.

ఈయ‌న‌కు బీజేపీ కీల‌క నేత‌ అమిత్ షాకు మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని, గ‌తంలో ఈయ‌న‌కేసులు ఆయ‌నే వాదించార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏదేమైనా.జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో ఇంత ధైర్యంగా ఉండ‌డం వెనుక బీజేపీ ఆడుతున్న నాట‌క‌మే ఉంద‌ని చెబుతున్నారు.

అందుకే ఏపీ బీజేపీ నేత‌లు కూడా సైలెంట్‌గా ఉన్నార‌ని, ఈ విష‌యంలో ఏ ఒక్కవిమ‌ర్శ కూడా చేయ‌డం లేద‌ని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube