వరంగల్ లోక్ సభ అప్ ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కమలం పార్టీ ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉంది.కసరత్తు ఇంకా పూర్తీ చేయలేదు.
గులాబీ పార్టీ కళాకారుడు పసునూరి దయాకర్ని ఎంపిక చేసి ప్రచారంలో దూసుకు పోతున్నది.కాంగ్రెస్ సిరిసిల్ల రాజయ్యను ప్రకటించింది.
కానీ బీజేపీ వెనుకబడింది.సరైన నాయకుడు కమలం పార్టీకి దొరకడం లేదని చెబుతున్నారు.
కొందరు డబ్బున్న నాయకులు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు.కానీ వారు వరంగల్ జిల్లాకు చెందిన వారు కాకపోవడంతో పక్కన పెట్టింది.
ఇక వరంగల్ ప్రజలకు తెలిసిన వారికి డబ్బు లేదు.మిత్ర పక్షం టీడీపీకి కూడా ఇష్టమైన వీడినే ఎంపిక చేయాలి.
అసలే అభ్యర్థులు దొరకడం లేదంటే మద్యలో ఇదొక లింక్ ఉంది.దీంతో బీజేపీ నాయకులు కిందా మీదా పడుతున్నారు.
ఇది ఉప ఎన్నిక కాబట్టి పార్టీ పరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్ట పడటం లేదేమో.అందుకే డబ్బున్న మనిషి కోసం గాలిస్తున్నారు.
తాము డబ్బు లేని పేద వాడిని ఎంపిక చేశామని , ఖర్చు పార్టీ పెట్టుకుంటుందని గులాబీ పార్టీ నాయకులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.అభ్యర్థినే ఎంపిక చేసుకోలేని వారు ఎన్నికలో ఎలా గెలుస్తారని కాంగ్రెస్, కారు పార్టీ నాయకులు బీజేపీని ఎద్దేవా చేస్తున్నారు.