కర్ణాటక ఉప ఎన్నికలలో సత్తా చాటిన బీజేపీ  

Bjp Wins 12 Out Of 15 Seats In Karnataka Bypolls-congress,jds,karnataka Bypolls,karnataka Politics,kumaraswamy

కర్ణాటక రాజకీయం ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది.అక్కడి ప్రజలు ఎప్పుడు కూడా స్పష్టమైన మెజారిటీని ఏ పార్టీకి ఇవ్వరు.

Bjp Wins 12 Out Of 15 Seats In Karnataka Bypolls-congress,jds,karnataka Bypolls,karnataka Politics,kumaraswamy తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేష-BJP Wins 12 Out Of 15 Seats In Karnataka Bypolls-Congress Jds Karnataka Bypolls Politics Kumaraswamy

దీంతో ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు అక్కడ చాలా సందిగ్ధంగా ఉంటుంది.ఇక మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికలలో కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి వంద సీట్లు వచ్చిన కూడా కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.

అయితే రెండేళ్ళు పరిపాలించిన జేడీఎస్ కుమారస్వామి బీజేపీ మాస్టర్ ప్లాన్ కి దొరికిపోయాడు.కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అధికారాన్ని కోల్పోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది.

దీంతో యడియారప్ప ముఖ్యమంత్రి పీఠం మీదకి వచ్చారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు రాజీనామా చేసిన 15 నియోజక వర్గాలలో ఉప ఎన్నికల జరిగి తాజాగా ఫలితాలు వెలువడ్డాయి.

ఈ ఎన్నికలలో 15 స్థానాలకు బీజేపీ 12 స్థానాల్లో గెలవడం జరిగింది.దీనిపై కర్ణాటక సీఎం యెడియూరప్ప స్పందించారు.తమ పార్టీకి ఇది గొప్ప విజయమని ఇప్పటికైనా ప్రతిపక్షం తమపై ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు.ప్రజలు మద్దతు తమ పార్టీకే ఉందని అన్నారు.

ఇక రాబోయే మూడున్నరేండ్లు కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని యెడియూరప్ప తేల్చిచెప్పారు.ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని సీఎం హామీనిచ్చారు.

గెలిచినా వారిలో కొంత మంత్రికి మంత్రి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.

.

తాజా వార్తలు