కాల్చి వాత‌లు పెట్టినా బీజేపీ మార‌దా... జీవీఎల్ కామెడీ ప్ర‌గ‌ల్భాలు....!

బీజేపీలో కీల‌క నాయ‌కుడు.ఎంపీ.

 Bjp Will Not Change His Manner..gvl  Shocking  Comments,ap,ap  Political News,la-TeluguStop.com

జీవీఎల్ న‌ర‌సింహారావు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపాయి.తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే.

ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ఆయ‌న వ్యాఖ్యానించారు.అంటే.

తెలంగాణ‌లోని దుబ్బాక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో బీజేపీ విజ‌యాన్ని ఆయ‌న ఉటంకిస్తూ.ఏపీలోనూ ఇదే త‌ర‌హాలో పుంజుకునేందుకు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేయాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు.

కానీ, తెలంగాణ‌కు, ఏపీకి తేడా లేదా ? అనే విష‌యాన్ని మాత్రం మ‌రిచిపోయార‌ని బీజేపీ సీనియ‌ర్లు గుస గుస‌లాడుతున్నారు.తెలంగాణ‌లో బీజేపీకి, ఏపీ బీజేపీకి తేడా ఉంద‌నేది వారి మాట‌.

దీనికి రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.ఒక‌టి తెలంగాణ విష‌యాన్ని చూస్తే.అక్క‌డ రాష్ట్రం ఏర్పాటులో బీజేపీ కూడా ప్ర‌య‌త్నించింది.పైగా తెలంగాణ కోసం ఉద్య‌మించిన చ‌రిత్ర కూడా ఉంది.

ఇక‌, కేసీఆర్ కుటుంబ పాల‌న చేస్తున్నార‌నే టాక్‌తో పాటు.రెండు సార్లు అధికారం ఇచ్చినా.

ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయ‌నే అభిప్రాయం కూడా ప్ర‌జ‌ల్లో ఉంది.ఆ మాట‌కు వ‌స్తే బీజేపీ ప్ర‌స్థానం దేశ‌వ్యాప్తంగా రెండు సీట్ల‌తో ప్రారంభ‌మైన‌ప్పుడే ఆ ఒక్క సీటు హ‌న్మ‌కొండలో గెలిచింది.

ఇక్క‌డ బీజేపీ పునాది అయిన జ‌న‌సంఘ్ మూలాలు ద‌శాబ్దాలుగా బ‌లంగా ఉన్నాయి.

Telugu Ap, Gvl Simharao, Hot, Latest, Telangana, Ysrcp-Telugu Political News

కానీ, ఏపీ విష‌యానికి వ‌స్తే.ఇది డిఫ‌రెంట్‌.ఇక్క‌డ బీజేపీ చేయాల్సింది చేయ‌క‌పోగా.చేస్తాన‌ని చెప్పిన వాటిని కూడా ప‌క్క‌న పెట్టింది.ప్ర‌త్యేక హోదా, రాజ‌ధాని విష‌యాల్లో కేంద్రం మౌనం పాటిస్తోంది.దీంతో ప్ర‌జ‌ల్లో బీజేపీపై ఏవ‌గింపే క‌నిపిస్తోంది.అందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి కర్ర కాల్చి వాత‌పెట్టిన‌ట్టుగా ఒక్క చోటంటే ఒక్క చోట కూడా డిపాజిట్ రాకుండా చేశారు.

మ‌రోవైపు ఏపీలో ఎక్క‌డా జ‌గ‌న్ కుటుంబ పాల‌న‌ను చేయ‌డం లేదు.సో.ఇలా తెలంగాణ‌కు, ఏపీకి మ‌ధ్య సారూప్య‌త‌ల విష‌యంలో చాలా తేడా క‌నిపిస్తోంది.మ‌రీ ముఖ్యంగా బ‌ల‌మైన నాయ‌కులు తెలంగాణలో బీజేపీని ముందుకు న‌డిపిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇక‌, ఏపీలో ఆ త‌ర‌హా ప‌రిస్థితి బీజేపీ అధిష్టానానికే క‌నిపించ‌డం లేదు.ఇక‌, ఇక్క‌డ గ్రూపు రాజ‌కీయాలు క‌మ‌ల నాథుల‌కు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించాయి.ఇన్ని ప‌రిణామాలు తేడా పెట్టుకుని ఎవ‌రు ఎవ‌రిపై స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేస్తారో.జీవీఎల్ చెప్పాల‌నేది .బీజేపీ సీనియ‌ర్లు, త‌ట‌స్థుల మాట‌.ఏదేమైనా .జీవీఎల్ చెప్పిన దానికీ , రాష్ట్రంలో క్షేత్ర‌స్థాయి ప‌రిణామాల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంద‌నే విష‌యంలో ఎలాంటి తేడా క‌నిపించ‌డం లేదు.అయినా.

ఏదో మాట్లాడాలి క‌నుక మాట్లాడార‌నే భావ‌న వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube