ప్రత్యేక రాయలసీమ ఇవ్వలేరా!!

ప్రత్యేక రాష్ట్రం అనే నినాదం రోజు రోజుకు పెరిగిపోతుంది.దాదాపు 60ఏళ్లకు పైగా పోరాటం చేసిన తరువాత తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది.

 Bjp Twist On Special Rayaalaseema-TeluguStop.com

ఇదిలా ఉంటే….అంతటితో ఆగిపోక…ఇలాంటి వాటిని రాజకీయం చేసే దిశలో ప్రతీ రాజకీయ పార్టీ తమదైన శైలిలో దూసుకుపోతుంది…నిన్న మొన్నటి వరకు సీమాంధ్రకు ప్రత్యేక హోదా అంటూ డప్పులు కొట్టిన కమలం పార్టీ ఇప్పుడు రాయల సీమ పై కొత్తగా ప్రేమ ఒలక పోతుంది.

విషయం ఏమిటంటే…బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ…భారతదేశంలో చిన్న రాష్ట్రాల వల్ల పాలనకు అనుకూలంగా ఉండి అభివృద్ధిపథంలో పయనించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ,రాష్ట్రం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం రాయలసీమ ప్రజల్లో అభివృద్ధి జరుగడం లేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు కనిపిస్తుంది అని ఆయన తెలిపారు.అంతేకాకుండా సమానాభివృద్ధి లేకపోవడం కారణంగానే తెలంగాణలో ఉద్యమం పుట్టిందని, తాజా పరిస్థితులను చూస్తుంటే రాయలసీమలో కూడా ఉద్యమానికి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న బిజెపి రాయలసీమ ప్రజలు కోరితే మద్దతునివ్వడానికి ఎప్పుడూ ముందు ఉంటాం అని ఆయన తెలిపారు.ఇదే క్రమంలో రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కోస్తాంధ్ర వైపే చూస్తోందన్న భావన రాయలసీమ ప్రజల్లో ఉంది, రాష్ట్రంలో నిధులు భారీఎత్తున కోస్తాంధ్ర ప్రాంతానికి ఖర్చు చేయడం వల్లే తెలంగాణాలో ఒక్క హైదరాబాద్ మినహా ఇతర జిల్లాలు ఏవీ అభివృద్ధి సాధించలేదని, ఫలితంగా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికి ఉద్యమ తీవ్రత పెరిగిందన్నారు.

అదే పరిస్థితి రాయలసీమలో రాకుండా ఉండాలంటే ప్రభుత్వం సమానాభివృద్ధి సూత్రాన్ని పాటించాలని ఆయన సూచించారు.మరి ఈ ఇంతగా రాయాసీమపై బీజేపీ ప్రేమ చూపిస్తుంది అంటే, ఇప్పటి నుంచే 2019ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతుంది అని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube