' కాపు ' ముద్ర కోసం బీజేపీ ఆరాటం ?   

bjp tdp janasena kapu caste pavan kalayan, ap, bjp, caste, chandrababu, janasena, kapu, mudragada padbhanabham, pawan kalyan, somu verraju, tdp - Telugu Ap, Bjp, Caste, Chandrababu, Janasena, Kapu, Mudragada Padmanabam, Pavan Kalyan, Somu Veeraju, Tdp

కమ్మల పార్టీగా టీడీపీ, రెడ్ల పార్టీగా వైసీపీ ఏపీలో పేరు సంపాదించాయి.దాదాపుగా టిడిపికి పూర్తిగా కమ్మలు, వైసిపికి రెడ్ల మద్దతు ఉంది.

TeluguStop.com - Bjp Try To Kapu Caste Support In Ap

ఆ సామాజిక వర్గాల వారు తమ సొంత పార్టీలు గా వీటిని చూస్తూ ఉంటారు.ఇప్పుడు అదే తరహాలో కాపు పార్టీగా బిజెపి ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కొద్ది రోజులుగా బిజెపి వ్యవహారశైలిని చూస్తే ఇదే అర్థమవుతుది.ఇప్పటికే బిజెపి అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఉన్నారు.

TeluguStop.com - కాపు ముద్ర కోసం బీజేపీ ఆరాటం  -Political-Telugu Tollywood Photo Image

ఆయనతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నాయకులను బిజెపి ఇప్పటికే పార్టీలో చేర్చుకుంది.ఇంకా కాపు సంఘాల నాయకులను బిజెపిలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.

కొంతమందిని ఇప్పటికే చేర్చుకోగా, మరికొంతమందిని చేర్చుకుని వారికి కీలకమైన పదవులు ఇవ్వాలని చూస్తోంది.దీనిలో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను చేర్చుకునేందుకు బిజెపి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

ఆయన పార్టీలో చేరితే కాపు సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా బీజేపీకి ఉంటుందని నమ్ముతోంది.దీని కోసం ఎన్నో లెక్కలు బిజెపి వేసుకుంటోంది.కానీ ఆయన పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లి మరీ ఆయన ను బీజేపీలో చేరేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ప్రతిపాదన చేసినట్లు సమాచారం.

కానీ ముద్రగడ బీజేపీలో చేరుతానని గాని, చేరను అని కానీ ఏ క్లారిటీ ఇవ్వకపోయినా, ఆయన తప్పనిసరిగా బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.

Telugu Ap, Bjp, Caste, Chandrababu, Janasena, Kapu, Mudragada Padmanabam, Pavan Kalyan, Somu Veeraju, Tdp-Telugu Political News

దీనికి తోడు జనసేన పార్టీ సైతం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆ సామాజిక వర్గానికి చెందిన ఎక్కువమంది జనసేన ను అభిమానిస్తుండడంతో తమకు కలిసొస్తాయని బిజెపి లెక్కలు వేసుకుంటోంది.ఏపీలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంది.ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలోనూ తప్పనిసరిగా ఆ ప్రభావం కనిపిస్తుంది అని బిజెపి అంచనా వేస్తోంది.

ఇది తమకు కలిసి వస్తుందని బిజెపి అంచనా వేస్తోంది.ఇప్పటికే కాపు సామాజిక వర్గం తమకు రాజకీయంగా సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి చాలాకాలం నుంచి ఉంది.

జనసేన ద్వారా దాన్ని తీర్చుకుందామని చూసినా, అది సాధ్యపడలేదు.ఇప్పుడు బీజేపీ జనసేన కూటమి కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పూర్తిగా కాపు సామాజికవర్గం అండదండలు తమకు ఉంటాయని బిజెపి అంచనా వేస్తోంది.

కుల ముద్ర బీజేపీపై పడిన పరవాలేదు అన్నట్లుగానే ఆ పార్టీ వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తోంది.

#Somu Veeraju #Kapu #Pavan Kalyan #Janasena #Caste

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు