మిగిలింది కాపులే లాగేద్దాం ! బీజేపి ఓవర్ స్పీడ్ ?

కేవలం హిందుత్వ అజెండా తో  మాత్రమే రాజకీయాలు చేసి, ఇప్పుడు సాంప్రదాయ పార్టీ ల బాటలోనే తామూ అన్నట్టుగా వ్యవహారాలు చేస్తోంది బీజేపీ.ముఖ్యంగా ఏపీలో ఉన్న పరిస్థితుల కారణంగా బిజెపి బలం పెంచుకునేందుకు అవకాశం ఇప్పటి వరకు ఏర్పడ లేదు.

 Mudragada Padmanabam Bjp Kapu Caste Kamma Reddy, Ap, Bjp, Caste, Kamma, Kapu, Mu-TeluguStop.com

కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు అయిన టిడిపి వైసిపి పార్టీలు మాత్రం కుల సమీకరణాల విషయంలో సక్సెస్ అవుతూ  వస్తున్నాయి.ఏపీలో ప్రధానంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల హవానే నడుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం పూర్తిగా మద్దతు ఇస్తుండగా, రెడ్డి సామాజికవర్గం వైసీపీ వైపు పూర్తిగా నిలబడింది.బీసీలలో ఉన్న వివిధ సామాజిక వర్గాల వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తే , ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అయితే మరో ప్రధాన సామాజిక వర్గమైన కాపులు సైతం రెడ్డి, కమ్మ సామాజిక వర్గం మాదిరిగా సక్సెస్ కావాలని చూస్తున్నారు.

గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో ఆయనకు అండగా నిలబడినా, మిగతా కులాల ఆదరణ దక్కించుకోవడంలో ఆయన సక్సెస్ కాలేకపోయారు.

 ఇక జనసేన పరిస్థితి ఇంతే.

అందుకే 2019 ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇప్పుడు ఏపీలో అధికారం సంపాదించాలని చూస్తున్న బీజేపీ కాపులకు తమ పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని, కాపుల పార్టీగా బీజేపీ ని చూపించి వారి అందరి మద్దతు సంపాదించుకుని కాపులతో పాటు, వివిధ సామాజిక వర్గాల మద్దతు సంపాదించి సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తోంది.

ఈ క్రమంలోనే మాజీమంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ను ఇప్పుడు బీజేపీ లోకి తెచ్చేందుకు రాజకీయం చేస్తోంది.ఆయన బిజెపి లో చేరితే తమ పార్టీలో రాజ్యసభ సభ్యత్వం తో పాటు, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించి కేంద్ర స్థాయిలో తగిన నిర్ణయం తీసుకుంటామనే సంకేతాలను ఇస్తోంది.

Telugu Kamma, Kapu, Pavankalyan, Reddy, Somu Veeraju, Ysrcp-Telugu Political New

ఒక వైపు పవన్ .మరోవైపు కాపు , ఇంకో వైపు కాపు సామాజికవర్గం అండదండలు పుష్కలంగా లభిస్తాయి  అనే లెక్కల్లో బిజెపి ఉంది.అందుకే ఇంత అకస్మాత్తుగా  ఇప్పుడు ఆఫరేషన్ కాపు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను చేర్చుకునే పనిలో బిజెపి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube