రేవంత్ కు బీజేపీ గేలం ? కేంద్ర పెద్దల ఆశక్తి ?

పదునైన మాటలతో ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తూ, తెలంగాణలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ముద్ర వేయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది.

 Bjp ,congress ,trs, Kcr ,ktr, Revanthreddy, Modhi, Amithsha,-TeluguStop.com

ఆ పార్టీకి మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి తన శక్తికి మించి గట్టిగా కష్టపడుతున్నారు.ఈ వ్యవహారంలో మిగతా కాంగ్రెస్ సీనియర్ల నుంచి తగిన సహకారం లేకపోయినా, రేవంత్ పట్టించుకోవడం లేదు, కాంగ్రెస్ లో నిత్యం గ్రూపు రాజకీయాలు షురూ మామూలుగానే ఉంటున్నాయి.

ఆధిపత్యం చెలాయించేందుకు పార్టీ సీనియర్ నాయకులంతా ప్రయత్నిస్తున్న క్రమంలో పార్టీ ఎదుగుదలకు వారంతా స్పీడ్ బ్రేకర్ల గా మారారు.

వీటన్నిటినీ తట్టుకుంటూనే రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పై రాజీ లేకుండా పోరాటం చేస్తూ, ప్రభుత్వం లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటున్నా, కేసీఆర్ కు మాత్రం రేవంత్ భయం ఎక్కువగా ఉంది.ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది.

రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఈ తరుణంలో టిఆర్ఎస్ పై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఇప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలోకి వచ్చేందుకు ఒప్పిస్తే ప్రస్తుత ఫలితాలు అనుకూలంగా రావడంతో పాటు, రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పై బీజేపీ పట్టుసాధించేందుకు సాధ్యమవుతుందని, 2023 ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చేలా రేవంత్ చేయగలరనే నమ్మకాన్ని కేంద్ర బీజేపీ పెద్దలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆయన బీజేపీలోకి తీసుకువచ్చే విధంగా అప్పుడే మంతనాలు మొదలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం కనిపించకపోవడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్న పరిణామాలతో రేవంత్ సైతం అసంతృప్తి గా ఉంటూ వస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన కు  బీజేపీ గేలం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఒకవేళ బీజేపీ లోకి వచ్చేందుకు రేవంత్ ఒప్పుకుంటే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారే అవకాశం లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube