రేవంత్ ను వదలనంటున్న బీజేపీ ? ఆఫర్లు ఇస్తున్నా ?

పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ముక్కుసూటిగా మాట్లాడటం, రాజకీయ ప్రత్యర్థులపై వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తూ, వారిని ఇరుకున పెట్టడంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాగా ఆరితేరి పోయాడు.

 Bjp Interested On Revanth Reddy, Tpcc Chief, Congress Leader Revanth Reddy, Bjp-TeluguStop.com

తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నా, టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించడంలో రేవంత్ ది అందివేసిన చేయి.అందుకే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఆయన తనయుడు కేటీఆర్, ఇలా ఎవరైనా రేవంత్ దూకుడును అడ్డుకునేందుకు ప్రతి సందర్భంలోనూ ప్రయత్నిస్తూనే ఉంటారు.

రేవంత్ వ్యాఖ్యలు ఆ మేరకు ప్రభావం చూపించి నష్టాన్ని చేస్తాయని వారికి బాగా తెలుసు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్నా, ఏదో ఒకరకంగా ఆ పార్టీకి మైలేజ్ తెచ్చేందుకు రేవంత్ గట్టిగానే కష్టపడుతున్నారు.

పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతూ, రేవంత్ కు వ్యతిరేకంగా మిగతా పార్టీ సీనియర్లు అంతా ఏకమై విమర్శలు చేస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ ను తెలంగాణలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో రేవంత్ ఉంటూ వస్తున్నారు.

ఆయనపై ఎన్ని రకాలుగా కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా, వాటిని ఎదుర్కొంటూనే, ధైర్యంగా ముందడుగు వేస్తున్న తీరుతో ఆయన మరింత క్రేజ్ సంపాదించుకుంటూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, రేవంత్ చరిష్మాను ఉపయోగించుకుని, తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనతో బిజెపి చాలా కాలంగా ఉంది.దీనిలో భాగంగానే ఆయనను పార్టీలో చేర్చుకోవాలని, అవసరమైతే కీలక పదవి అప్పగించాలని చూస్తోంది.

దీనిలో భాగంగానే ఇప్పటికే అనేక సార్లు ఆయనకు వర్తమానాలు పంపినా, ఆయన నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో, సైలెంట్ అయిపోయారు.ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం తొందర్లోనే వచ్చే అవకాశాలు ఉండడం వంటివి లెక్కలు వేసుకుంటున్నారు.

అందుకే ఏదో ఒకరకంగా రేవంత్ ను బిజెపిలోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు.అందుకే రేవంత్ ఒప్పించేందుకు కొంతమంది కీలక నాయకులను సైతం రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని, బిజెపి లోకి వస్తే కీలకమైన నేతగా ఎదుగుతారు అని, దీంతో పాటు మీ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఢోకా లేకుండా చూసుకోవచ్చు అనే సూచనలు చేస్తూ, అదేపనిగా రేవంత్ ను ప్రసన్నం చేసుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లుగా, ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.ఒక దశలో రేవంత్ సైతం బిజెపిలోకి వెళ్లాలని చూశారు.

కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలతో విసిగిపోయిన ఆయన ఇక తనకు రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ లో ఉంటే అగమ్యగోచరంగా మారుతుందని, కాంగ్రెస్ సీనియర్లు తన ఎదుగుదలకు అడ్డుపడతారనే అభిప్రాయంలో ఉంటూ వచ్చారు.అయితే ఇప్పుడు ఆ ఆలోచనను కాస్త విరమించుకున్నట్టు గా కనిపిస్తున్నా, బీజేపీ మాత్రం గట్టిగా ప్రయత్నిస్తే రేవంత్ పార్టీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేసుకుంటోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube