జమిలి ఎన్నికలకే మోదీ జై ? బాబు బాగా హ్యాపీ ?  

BJP trying to conducting jamili elections, jamili elections, Chandrababu, Narendra modi, TDP, BJP,Chandrababu Happy over jamili elections - Telugu Bjp, Bjp Trying To Conducting Jamili Elections, Central Government, Chandrababu, Chandrababu Happy Over Jamili Elections, Jagan, Jamili Elections, Narendra Modi, Tdp, Ysrcp

కేంద్రంలో రాజకీయ పరిణామాలు శర వేగంగా మారిపోతున్నాయి.దేశవ్యాప్తంగా మరోసారి తమ పట్టు నిలుపుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బిజెపి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లు వేసుకుంటూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

TeluguStop.com - Bjp Try To Conducting Jamili Elections

ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి, మరోసారి హ్యాట్రిక్ కొట్టాలనే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.అంటే ముందస్తుగా ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేంద్ర బిజెపి పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ మేరకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు అంటే, జమిలి ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అసలు మొదటి నుంచి ఈ జమిలి ఎన్నికల విధానాన్ని బిజెపి హైలెట్ చేస్తూ వచ్చింది.

TeluguStop.com - జమిలి ఎన్నికలకే మోదీ జై బాబు బాగా హ్యాపీ -Political-Telugu Tollywood Photo Image

కొద్దిరోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో, ఓ కీలక సమావేశం జరిగిందట.ఆ సమావేశంలో ఓకే ఓటర్ లిస్ట్ దేశమంతా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అంటే లోక్ సభ కు వాడిన ఓటింగ్ లిస్ట్ అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు వాడే విధంగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే జమిలి ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపిస్తుంది అనేదానికి సంకేతాలుగా అంతా భావిస్తున్నారు.

కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్ర లతో సంబంధం లేకుండా, స్థానిక సంస్థల ఎన్నికల జాబితా కూడా ఎటువంటి సవరణలు చేయకుండా యధాతధంగా ఉండబోతోంది.కేంద్రం అమలు చేయబోతున్న ఈ విధానాన్ని, అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తాయా లేదా అనేది అనుమానంగా ఉంది.

దీనికి కారణం స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా ఆయా రాష్ట్రాల నిర్ణయాల మేరకు ఉంటాయి .కానీ కేంద్రం తీసుకొస్తున్న ఈ విధానం ద్వారా రాష్ట్రాలకు అధికారం పోతుంది.

ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం ఉండదు.ఈ విధానాన్ని కేంద్రం అమలు చేయాలని చూస్తోంది.దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.ఇదే కనుక అమలైతే దేశవప్తంగా జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదు.2022 లో దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.అలాగే 2023 లోనూ, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి.

వీటన్నిటిని లెక్క వేసుకుంటున్న కేంద్రం 2022 లోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కేంద్రంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు టిడిపి అధినేత చంద్రబాబులో ఆనందం నింపుతున్నాయి.

అందరి కంటే ముందు నుంచి ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికలు వస్తాయని పదేపదే చెబుతూ వస్తున్నారు.పార్టీ శ్రేణులకు సైతం ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు.

ఇప్పుడు కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి, తన మాట నిజమవుతుందని, జమిలి ఎన్నికలు అసాధ్యం అంటూ హేళన చేసిన వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ కాబోతుంది అంటూ బాబు ఖుషీగా ఉన్నారట.

#Ysrcp #Jagan #Narendra Modi #Chandrababu #BJPTrying

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Try To Conducting Jamili Elections Related Telugu News,Photos/Pics,Images..