నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న బీజేపీ

త్వరలో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

 Bjp To Give Big Shock To Congress In Nagarjuna Sagar By Elections, Congress Part-TeluguStop.com

అయితే ఇప్పటివరకు నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది.అయితే కేసీఆర్ గాలితో జానారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే.

అయితే రోజురోజుకు తెలంగాణలో బలపడుతున్న బీజేపీ ఈ నియోజకవర్గంలో గెలుపుపై వ్యూహాలు రచిస్తోంది.అయితే జానారెడ్డి కుమారుడిని రంగంలోకి దింపాలనుకున్న బీజేపీ జానారెడ్డి పార్టీ మారడానికి సుముఖంగా లేకపోవడంతో బీజేపీ నేతలు సైలెంట్ అయిపోయారు.

అయితే ప్రస్తుతం బీజేపీ ఆ నియోజకవర్గంలో 9, 10 మంది నేతలను ఎంపిక చేయగా ఇక నోటిఫికేషన్ విడుదల కాగానే అభ్యర్థిని ప్రకటించే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభావం బాగా ఉండడంతో ఒక బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగలనుందనే చెప్పవచ్చు.

ఎందుకంటే కాంగ్రెస్ లో కుమ్ములాటలతో ప్రజల్లోకి వెళ్ళే సమయానికి ఇతర పార్టీలు వేగంగా తమ ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి.కాంగ్రెస్ కంచుకోట అయినందు వల్ల ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదనే చెప్పవచ్చు.

Telugu @bjp4telangana, Big Shock, Candis, Congress, Nagarjuna Sagar, Tactics-Tel.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube