జనసేనకు ఆ ప్రతిపాదన చేయబోతున్న బీజేపీ ? 

బిజెపి జనసేన పొత్తు పెట్టుకోవడం ద్వారా సులభంగా ఏపీలో అధికారంలోకి రావచ్చు అని, ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని చూస్తున్న తమ ఆశ తీరుతుందని బిజెపి ముందుగా అంచనా వేయడంతోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది.కానీ ఆ తర్వాత జనసేన ను పట్టించుకోనట్లుగానే బిజెపి అగ్రనేతల నుంచి  రాష్ట్ర నేతల వరకు అంత వ్యవహరించారు.

 Bjp To Merge With Janasena, Pawan Kalyan, Janasena, Bjp, Tdp, Tdp And Janasena A-TeluguStop.com

ఈ వ్యవహారం జనసేన కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.తమను పట్టించుకోని పార్టీతో మనం ఎందుకు పొత్తు పెట్టుకోవాలనే చర్చలు జనసేనలో నడిచాయి.

ఇక ఆ పార్టీతో పొత్తు రద్దు చేసుకుని టిడిపి వైపు వెళదాము అనే ఆలోచన ఉన్న సమయంలోనే,  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి పవన్ కళ్యాణ్ తమ రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించారు.
కేంద్ర బిజెపి పెద్దలు నుంచి రాష్ట్ర నేతల వరకు పవన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

అయినా తిరుపతిలో బిజెపి డిపాజిట్ దక్కించుకోలేకపోయింది.అయితే దీనికంతటికీ కారణం జనసేనకు సంబంధించిన ఓట్లు బీజేపీకి బదిలీ కాకపొచడమే.

ఈ విషయాన్ని బిజెపి గుర్తించింది.అంతేకాదు పవన్ సైతం మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించి తప్పించుకున్నారనే ఆగ్రహం బిజెపి నేతలలో కనిపిస్తోంది.

అదికాకుండా ఉభయగోదావరి జిల్లాల్లో మినహా ఎక్కడా జనసేన ప్రభావం పెద్దగా లేదని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో అర్థం అయిపోవడంతో బిజెపి ఇప్పుడు పొత్తు కాకుండా జనసేన ను  బీజేపీలో విలీనం చేయాల్సిందిగా మళ్లీ ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Telugu Ap, Bjp Janasena, Jagan, Janasena, Loksabha, Pavan Kalyan, Pawan Kalyan,

గతంలోనూ ఈ ప్రతిపాదన పెట్టినా, పవన్ దానికి ఒప్పుకోలేదు.అయితే ప్రస్తుతం జనసేన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, రెండు జిల్లాలు మిగతా చోట్ల పెద్దగా ప్రభావం కనిపించకపోవడంతో పవన్ సైతం రాజకీయ సందిగ్ధంలో ఉన్నారనే విషయాన్ని బిజెపి గుర్తించింది.అందుకే ఇప్పుడు తెరపైకి విలీన ప్రక్రియ కు తెరతీయనున్నట్టు తెలుస్తోంది.

అయితే పవన్ మాత్రం బిజెపి కంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో జనసేన కు రాజకీయ అనుకూల పరిస్థితులు ఉంటాయని, జనసేన టిడిపి కలిస్తే అధికారంలోకి రావడం కష్టమేమీ కాదనే అభిప్రాయము పవన్ లో కనిపిస్తోంది.కాకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పవన్ ఆలోచనలు పడ్డారట.

టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేందుకు ఆ పార్టీ ఒప్పుకోదు కాబట్టి ఈ విషయంలోనే క్లారిటీ తెచ్చుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube