ఎడిటోరియల్ : రాజకీయం నేర్చుకున్న పవన్ ! ఆందోళనలో బీజేపీ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  చాలా కాలంగా రాజకీయాలలో కొనసాగుతున్నా, ఇంకా ఆయన రాజకీయ పాఠాలు వంట పట్టించుకోలేదని , అందుకే ఆయనకు అధికారం అనేది అందని ద్రాక్షగా మారింది అనే టాక్ ఏపీ రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉంది.దీనికి తగ్గట్టుగానే ఆయన వ్యవహారం కూడా ఉంటూ వస్తుండడంతో పవన్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే విషయం పైన అందరికీ అనేక అనుమానాలు ఉన్నాయి.

 Bjp Tention On Pavan Kalyan Political Maind Game About Tirupathi By Elections, A-TeluguStop.com

గతంలో టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతు ప్రకటించి , ఆ పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎంతగానో పవన్ ప్రయత్నించారు.అనుకున్నట్టుగానే ఆ పార్టీలను గెలిపించడం లో పవన్ సక్సెస్ అవ్వడం తో , ఆ రెండు పార్టీలు ఆయనకు తగిన ప్రాధాన్యత ఇచ్చాయి.తర్వాత జనసేన ను ఎన్నికలలో బలోపేతం చేద్దాం అనే అభిప్రాయంతో ఆ రెండు పార్టీలకు దూరమయ్యారు.

2019 ఎన్నికలలో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలు అయ్యారు.దీంతో మళ్లీ బీజేపీ తోనే పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.ఇది ఇలా ఉంటె, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల విషయంలో జనసేన బీజేపీలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఒక క్లారిటీ కి రాలేక పోతున్నాయి.ఇదే సమయంలో అకస్మాత్తుగా తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి జనసేన సహకారంతో పోటీ చేయబోతున్నారు అంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం, పైగా ఇదంతా పవన్ అంగీకారంతోనే అంటూ ఆయన ప్రకటించడం వంటి వ్యవహారాల కారణంగా జనసేన విమర్శల పాలు అయింది.

కానీ ఈ విషయంలో ఎక్కడ పవన్ నోరు విప్పలేదు .సైలెంట్ గానే తన రాజకీయం చేసుకుంటూ వెళుతున్నారు.తాము తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేస్తామనే  విషయాన్ని బహిరంగంగా చెప్పకుండానే సంకేతాలు ఇస్తూ, ఎన్నికల బరిలో తాము ఉంటున్నామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Aliance, Apbjp, Committe, Greter, Janasena, Janasenani, Pawan Kalyan, Tir

 తాజాగా జనసేన ప్రకటించిన కార్యనిర్వాహక కమిటీ ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.ఈ కమిటీలో సభ్యులుగా హరిప్రసాద్ , మను క్రాంత్ రెడ్డి , రాందాస్ చౌదరి, కిరణ్ రాయల్, శ్రీమతి వినుత, పొన్న యుగంధర్, ఉయ్యాల ప్రవీణ్, తీగల చంద్రశేఖర్, గూడూరు వెంకటేశ్వర్లు, కంటే పల్లి ప్రసాద్ వంటి వారితో కమిటీ వేశారు.లోక్ సభ ఎన్నికల వ్యవహారాల వీరే చూసుకుంటారు.

పవన్ ఈ కమిటీని నియమించడంతో ఒక్కసారి గా బీజేపీలో ఆందోళన మొదలైంది.ఒకపక్క ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తున్నారని తాము ప్రకటించిన తర్వాత, పవన్ ఈ విధంగా దూసుకు వెళుతూ , తిరుపతిలో జనసేన అభ్యర్థి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా తీరు వంటివి బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు.

ఇప్పటికే జనసేన తరపున తిరుపతి నుంచి పోటీ చేసేందుకు అనేక మంది రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పవన్ తో భేటీ అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఎన్నికలలో త్యాగం చేసినట్లుగా, తిరుపతి ఎన్నికలలోనూ త్యాగం చేస్తే రాజకీయంగా నవ్వులపాలు కావ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే బిజెపి ని సైతం పట్టించుకోకుండా పవన్ సరికొత్త రాజకీయానికి తెర తీసినట్లుగా కనిపిస్తున్నారు.

అనుకున్నట్టు గానే పవన్ జనసేన తిరుపతి అభ్యర్థిని ప్రకటిస్తే బిజెపి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందా లేక ఇక్కడితోనే ముగుస్తుందా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube