కేసీఆర్ ఢిల్లీ టూర్ : వారితో కీలక భేటీ ! వీరిలో ఆందోళన ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు.10 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు.ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలతోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.అలాగే రాబోయే ఎన్నికల్లో బిజెపి ని ఏ విధంగా అధికారానికి దూరం చేయాలి అనే విషయం పైన కెసిఆర్ పూర్తిగా దృష్టి సారించారు.

 Bjp Tention On Kcr Delhi Tour-TeluguStop.com

అందుకే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీల అది నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.కెసిఆర్ ఢిల్లీ టూర్ లో కీలక నాయకులందరినీ కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు .

కేవలం రాజకీయ నాయకులే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతోనూ, జాతీయ మీడియా తోను కేసీఆర్ భేటీ కానున్నారు .తాజాగా ఈరోజు మధ్యాహ్నం అఖిలేష్ యాదవ్ తోను కేసీఆర్ భేటీ అయ్యారు .ఈ సందర్భంగా వారి మధ్య అనేక రాజకీయ అంశాల గురించి చర్చ జరిగింది ముఖ్యంగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.అలాగే ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్ళబోతున్నారు.

 Bjp Tention On Kcr Delhi Tour-కేసీఆర్ ఢిల్లీ టూర్ : వారితో కీలక భేటీ వీరిలో ఆందోళన -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఢిల్లీ, పంజాబ్ లలో మరణించిన రైతు కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.అంతే కాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోనూ కేసీఆర్ భేటీ అవుతారు గతంలోనే కేజ్రీవాల్ తో భేటీ అయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నించినా .ఆ సమయంలో బెంగళూరు పర్యటనలో ఉండడంతో అది సాధ్యపడలేదు.

ఇంకా ఈ పది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు, నాయకులతోను ప్రత్యేకంగా సమావేశమై అనేక రాజకీయ అంశాలపై చర్చించబోతుండడంతో బిజెపి ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది .దీంతో కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కేంద్రం నిఘా పెట్టి కేసీఆర్ ఎవరెవర్ని కలుస్తున్నారు .? కేసీఆర్ ఎవరితో ఎప్పుడు ఏ అంశం పై మాట్లాడుతున్నారు అనే సమాచారాన్ని కేంద్ర బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube