కొత్త స్కెచ్చే వేస్తున్న కేసీఆర్ ? మోదీ కి ముచ్చెమటలే ?

కేంద్ర అధికార పార్టీ బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెప్పలేనంత కోపం ఉంది.ఆ కోపంతోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో ఒక పార్టీని స్థాపించబోతున్నాడని, బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళి, అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని చూస్తున్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంబంధించి అనేక గాసిప్స్ వినిపించాయి.

 Bjp Tension Over Kcr Politics, Pm Modi, Cm Kcr, Telangana, Bjp Govt, Kcr Fires O-TeluguStop.com

అసలు తాను పార్టీ పెట్టడం లేదని, ఆ తర్వాత కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.తాజాగా టిఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేశారు.

తెలంగాణకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో సహకరిస్తూ వచ్చానని, కానీ వారు తెలంగాణ విషయంలో వివక్ష చూపిస్తున్నారని, అందుకే పార్లమెంట్ లోపల, బయటా ఎంపీలు బీజేపీని నిలదీయాలని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కేసీఆర్ పార్టీ ఎంపీలకు నూరిపోశారు.

అలాగే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో, పార్లమెంటు సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు.

పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి వంటి విషయాల్లో అనేక విమర్శలు ఎదుర్కొన్నా, ప్రభుత్వానికి అండగా నిలిచిన విషయం కేసీఆర్ గుర్తు చేశారు.తెలంగాణ విషయంలో బీజేపీ ప్రభుత్వ వైఖరి సక్రమంగా లేదని అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారు.

కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా, ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.అసలు కేంద్రం రాష్ట్రానికి అన్యాయమే చేస్తోందని, నిధుల విషయంలోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ రాజకీయ కక్ష సాధిస్తోందని ఎంపీలతో పాటు కేసీఆర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన 9 వేల కోట్ల నిధులను విడుదల చేయడం లేదని, కేసీఆర్ మండిపడ్డారు.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాలను కేంద్రం పట్టించుకోలేదని, తానే చొరవ తీసుకునన్నానని మండిపడ్డారు.

రాష్ట్రంలోనే కాక జాతీయ స్థాయిలో బీజేపీ కేంద్రానికి, రాష్ట్రానికి పెట్టుకున్న పిటిషన్ కు దిక్కు లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ కేసీఆర్ మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube