రిజ‌ర్వుడ్ నియోజ‌కవ‌ర్గాలే బీజేపీ టార్గెట్‌.. అధినాయ‌క‌త్వం ప్లాన్ ఇదే

ఇప్పుడు తెలంగాణ‌లో అధికారంలోకి రావాలని విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్న పార్టీ ఏదైనా ఉందా అంటే బీజేపీ అనే చెప్పుకోవాలి.ఎందుకంటే మిగ‌తా పార్టీల కంటే కూడా చాలా తీవ్రంగా నిర‌స‌న‌లు, ధ‌ర్నాల పేరిట స్పీడు పెంచేసిది బీజేపీ.

 Bjp Targets Reservewood Constituencies. This Is The Leadership Plan, Bjp, Ap Pol-TeluguStop.com

కేంద్ర నాయ‌క‌త్వం ఆదేశాల‌తో క్ష‌ణం కూడా తీరిగ్గా ఉండ‌కుండా నిత్యం ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఏదో ఒక ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూనే ఉంది.అయితే ప‌క్కాగా నియోజ‌క‌వ‌ర్గాల చొప్పున లెక్క‌లు వేసుకుంటూ మరీ రంగంలోకి దిగుతోంది బీజేపీ పార్టీ.

ముఖ్యంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల మీద‌నే ఫోక‌స్ పెడుతోంది.

తెలంగాణ‌లో రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మెజార్టీ స్థానాల‌ను గెలుచుకుంటే గెలుపు త‌థ్య‌మే అన్న‌ట్టు పార్టీ అంచనా వేస్తోంది.

ఇందుకు త‌గ్గ‌ట్లే బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.తెలంగాణ‌లో 19 ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.12 ఎస్టీ రిజ‌ర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి.ఇప్ప‌టికే ఈ నియోజకవర్గాల నేత‌ల‌తో సంజ‌య్ మీటింగ్ లు కూడా నిర్వహించారు.

ఇక్క‌డ బ‌ల‌మైన నేత‌ల‌ను కూడా త‌యారు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.క‌చ్చితంగా ఈ రిజర్వుడు స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావాల‌ని ప‌ట్టు మీద ఉన్నారు.

అయితే వీటి మీద దృష్టి పెట్టినంత మిగ‌తా వాటి మీద పెద్ద‌గా పెట్ట‌ట్లేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.ఈ రిజర్వుడు స్థానాల్లో ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కు గెలిచే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, కాబ‌ట్టి కొంచెం ఎక్కువ ప్రాముఖ్య‌త ఇస్తే గ‌న‌క ఇక్క‌డ క‌చ్చితంగా గెలిచే ఆస్కారం ఉంటుంద‌ని బండి సంజ‌య్ భావిస్తున్నారంట‌.గ‌తంలో కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం టీడీపీ మాత్ర‌మే గెలిచింది.ఆ పార్టీ పోయిన త‌ర్వాతే కేసీఆర్ వైపు మ‌ళ్లాయి.ఇప్పుడు పూర్తి స్థాయిలో టీఆర్ ఎస్‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గాలు రిజ‌ర్వుడ్ అయిపోయాయి.చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

BJP Targets Reservewood Constituencies. This Is The Leadership Plan, Bjp, Ap Politics - Telugu Ap, Bjptargets

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube