ఉద్య‌మ నేత‌లే బీజేపీ టార్గెట్‌.. ఈట‌ల మార్క్ రాజ‌కీయం..

ఏ చిన్న అవ‌కాశం దొరికినా వ‌ద‌ల‌కుండా తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తోంది బీజేపీ పార్టీ.ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్న ఆ పార్టీకి ఇప్పుడు మంచి టైమ్ న‌డుస్తోంది.

 Dar, Trs-TeluguStop.com

అన్ని వ‌ర్గాల నుంచి ఆ పార్టీకి మ‌ద్ద‌తు పెరిగింది.చాలా జిల్లా ల్లో  ఆ పార్టీకి పెద్ద‌గా ప‌ట్టు లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆయా జిల్లాల్లో ప‌ట్టు పెంచుకునేందుకు ప‌క్కా వ్యూహంతో పావులు క‌దుపుతోంది.అయితే ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ రూపంలో మంచి స్కోప్ దొరికింది.

ఆయ‌న విజ‌యం త‌ర్వాత చాలామంది టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

బీజేపీకి ప‌ట్టులేన‌టువంటి ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగే నేత‌ల‌ను ఇత‌ర పార్టీల్లోంచి త‌మ పార్టీలోకి తీసుకొచ్చేందుకు పావులు క‌దుపుతున్నారు రాష్ట్ర బీజేపీ నేత‌లు.

ముఖ్యంగా టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీకి ఆశ‌ప‌డి నిరాశ ప‌డ్డ నేత‌ల‌కు బీజేపీ గాలం వేస్తోంది.అసంతృప్తిలో ఉన్న వారిని బీజేపీలోకి ర‌ప్పించేందుకు ఈటల రాజేందర్ రంగంలోకి దింపింది.

ఇక తాజాగా విఠల్ తో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్న వారిని త‌మ పార్టీలోకి తీసుకెళ్లేందుకు ఈట‌ల రాజేంద‌ర్ ప‌క్కాగా పావులు క‌దుపుతున్నారు.రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆశ పెడుతున్నారు.

Telugu Bjptargets, Eetala Rajendar, Telongab, Telongana Bjp, Tg, Ts-Telugu Polit

బీజేపీలో అంద‌రికీ స‌మ‌న్యాయం ద‌క్కుతుంద‌ని, అంద‌రికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంద‌ని, కాబ‌ట్టి నియంతృత్వ టీఆర్ఎస్‌లో ఉండే కంటే బీజేపీలోకి వ‌స్తే బెట‌ర్ అని రాజ‌కీయ భ‌విష్య‌త్ మీద కూడా హామీలు ఇస్తున్నారంట కీల‌క బీజేపీ నేత‌లు.దీంతో టీఆర్ ఎస్‌లో ప‌ద‌వులు ద‌క్క‌ని ఉద్య‌మ నేత‌లు అంద‌రూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారంట‌.ఈ వ‌ల‌స‌లు ఇలాగే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన‌సాగితే మాత్రం రాబోయే కాలంలో బీజేపీకి తిరుగులేని శ‌క్తిగా ఎద‌గడం ఖాయ‌మ‌నే చెప్పాలి.ఇక ఇప్పుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌, రాణి రుద్ర‌మ‌దేవి లాంటి ప‌బ్లిక్ ఇమేజ్ ఉన్న వారు కూడా బీజేపీలోకి క‌లిసి వ‌స్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube