“జనసేన” టార్గెట్ గా బీజేపి “భారీ కుట్ర”       2018-05-16   23:22:25  IST  Bhanu C

కన్నడ కోటలో బీజేపి చక్రం తిప్పిన సంగతి విదితమే గత ఎన్నికల్లో బలంగా ఉన్న పార్టీలని సైతం తుంగలోకి తొక్కి ఏకపక్షంగా ప్రాంతీయ పార్టీలని సైతం దాటుకుంటూ ఏకంగా 104 సీట్లు సంపాదించడం మామూలు విషయం కాదు అయితే ప్రభుత్వ ఏర్పాటులో కొంత సందిగ్ధత నెలకొన్నా చివరకి ప్రభుత్వ ఏర్పాటు బీజేపి కి వెళ్తుంది అంతడంలో సందేహం లేదు..అయితే ఇప్పుడు ఈ ఊపు దక్షినాది రాష్ట్రాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపనుంది..ముఖ్యంగా ఏపీలో బీజేపి చక్రం తిప్పడానికి సిధంగా ఉంది..

ఎలా అయినా సరే టీడీపీ ని గద్దె దించి ఆ స్థానంలో వైసీపిని కూర్చో పెట్టాలని బీజేపి వ్యుహాలని అమలు చేస్తోంది..అందులో భాగంగానే జనసేనకి చెక్ పెట్టి మరీ వైసీపికి లైన్ క్లియర్ చేయాలనీ భావిస్తోందట..ఈ క్రమలోనే వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతోంది..వివరాలలోకి వెళ్తే…ఏపీ బీజేపీ వ్యవహారాలలో కాపులని పెద్ద తలకాయి చేశారు బిజెపి నేతలు…బీజేపి ఇక మీదట ఏపీలో పెద్ద దిక్కు కాపులే అన్న సంకేంతాలని పంపుతున్నారు అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర బీజేపి అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణకు, ఎన్నికల బాధ్యతను సోము వీర్రాజుకి బీజేపీ అప్పగించారు..

అయితే ఈ పరిణామాల వలన కాపు వర్గం ఓట్లకు గేలం వేయవచ్చని భావిస్తోంది కాపుల ఓట్లు జనసేన వైపు మళ్లుతాయని ఆశిస్తున్న వారికి నిరాశే మిగిలేలా ఉంది..ఇది జరిగి కాపు ఓట్లలో చీలిక వస్తే గనుకా జనసేన ఆశలపై నీళ్ళు జల్లినట్లే..ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో కాపు ఓట్లను తెలుగు దేశం దక్కించుకుంది…తద్వారా ఎన్నికల్లో విజయం సాధించింది..అయితే ఇదే తరహాలో కాపు ఓట్లు జనసేనకు మళ్లితే, జనసేన కొంత ప్రభావం చూపగలుగుతుంది…కానీ

బీజేపి తాజా వ్యూహంతో కాపులకు మంచి స్థానం దక్కుతున్న నేపథ్యంలో కాపు ఓట్లు చీల్చటం ద్వారా ఒకే సారి తెలుగు దేశానికి జనసేనకి భారీ నష్టం కలిగేలా ప్లాన్ చేసింది…ఈ క్రమంలోనే కాపుల ఓట్లు చీలిపోయి టీడీపీ, జనసేన నష్టపోగా వైసీపికి లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు..పవన్ కళ్యాణ్ ని చిక్కుల్లోకి నెట్టి మరీ వైసీపి కి న్యాయం చేయాలని భావిస్తోంది బీజేపి..ఏది ఏమైనా సరే తెలుగు దేశం ఓటమి కోసం ఏపీలో బీజేపి చక్రం తిప్పడం కోసం బీజేపి తన అమ్ముల పొలది నుంచీ ఒక్కో అస్త్రం బయటకి తీస్తోంది అనడంలో సందేహం లేదు..