జగన్ పై బీజేపీ బెయిల్ అస్త్రం ? 

తెలుగుదేశం పార్టీ ఏపీలో బాగా బలహీనపడడంతో, అధికార పార్టీ తో ప్రధానంగా తలపడెందుకు బీజేపీ, జనసేన గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో బీజేపీ,  వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు గా పోటీ వాతావరణం నెలకొంది.

 Bjp Target On Jagan About Jagan Bail Issue-TeluguStop.com

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగు కావడంతో, ఏపీలో ను అదే పరిస్థితి ఆ పార్టీకి వస్తుందని బిజెపి పెద్దలు చెబుతున్నారు.దీంతో వైసీపీకి రాజకీయ ప్రత్యామ్నాయంగా తాము మాత్రమే ఉంటామని బీజేపీ నమ్ముతోంది.

ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని చూస్తున్న, అందుకు తగిన వాతావరణం ఏర్పడకపోవడంతో పరిస్థితి సానుకూలంగా మారడం లేదు.

 Bjp Target On Jagan About Jagan Bail Issue-జగన్ పై బీజేపీ బెయిల్ అస్త్రం  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందని బీజేపీనమ్ముతోంది.

అందుకే ఇప్పుడు పూర్తి స్థాయిలో వైసిపి పై ఫోకస్ పెడితే జనసేన సహకారంతో అధికారం తగ్గించుకోవచ్చని బీజేపీ నమ్ముతోంది.వైసిపి విషయానికి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ బాగా బలపడింది.

తమకు ఎదురే లేదు అన్నట్లుగా జగన్ ముందుకు దూసుకెళ్తున్నారు.పూర్తిగా వైసీపీ ప్రభావం కంటే జగన్ ప్రభావం ఆ పార్టీ పై ఎక్కువగా ఉంది.

ఆ పార్టీలో నాయకులు అంతా జగన్ చరిష్మా మీద ఆధారపడిన వారే.నాయకుల అవసరం జగన్ కు ఏమాత్రం లేదన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది.

జగన్ చూసి జనాలు ఓటు వేసే పరిస్థితి నెలకొంది.

Telugu Admk, Ap Politics, Bjp, Bjp And Jagan, Bjp Vs Ysrcp, Chandrababu, Jagan Bail, Janasena, Jayalalitha, Modhi, Pavan Kalyan, Tamilanadu, Tdp, Ysrcp-Telugu Political News

  2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు ద్వారా ఈ విషయం అర్థమవుతుంది.దీంతో జగన్ ను కనుక ఇరుకున పెడితే వైసీపీ పూర్తిగా దెబ్బతింటుందని, జగన్ తరువాత ఆ పార్టీలో ఆ స్థాయిలో ప్రభావం చూపించే నాయకులు ఎవరూ లేరు కాబట్టి , తమ పని సులువు అవుతుందనే లెక్కల్లో బీజేపీఉంది.తమిళనాడులో ఈ తరహాలోనే తాము సక్సెస్ అవుతాము అని నమ్ముతోంది.

అక్కడ జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకే విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య ఉన్న విభేదాలను వాడుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని అన్నాడీఎంకే స్థానంలోకి బీజేపీ రావాలని చూస్తోంది.
  ఇక్కడ కూడా అదేవిధంగా ముందుకు వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నట్టు గా అర్థం అవుతోంది.అందుకే వివిధ కేసులలో జగన్ బెయిల్ పై ఉన్నారు .ఈ కేసులలోనే జగన్ ను ఇబ్బంది పెట్టి, వైసీపీని బలహీనం చేస్తే , సులువుగా ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చనే ఆలోచనతోనే ఇప్పుడు బీజేపీ పావులు కదుపుతున్న తీరు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.   

.

#Jayalalitha #Tamilanadu #AP Politics #Jagan Bail #Modhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు