ఎంత పనిచేసావ్ నాని ? జగన్ కు ఎన్ని ఇబ్బందులో ?  

bjp taget on ap minister kodali nani , BJP leaders, Kodali nani, Narendra Modi,YCP, BJP, Temple visits - Telugu Bjp, Bjp Leaders, Bjp Taget On Ap Minister Kodali Nani, Kodali Nani, Narendra Modi, Temple Visits, Ycp

ఏపీ మంత్రి కొడాలి నాని కొద్దిరోజులుగా వివాదాస్పదం అవుతూనే ఉన్నారు.టీడీపీని ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ నాని ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తోంది.

TeluguStop.com - Bjp Taget Ap Minister Kodali Nani

వైసీపీ ప్రభుత్వం పైన కానీ, జగన్ పైన కానీ ఎవరైనా విమర్శలు చేస్తే అస్సలు ఊరుకోరు.చంద్రబాబు ఆ పార్టీ నాయకులు జగన్ ను లక్ష్యంగా చేసుకుని అనేక విమర్శలు చేస్తుంటారు.

అంతర్వేది ఘటనతో పాటు, తిరుమలలో అన్యమతస్తుల కోసం ఏర్పాటు చేసిన డిక్లరేషన్ వ్యవహారంపైనా పదే పదే విమర్శలు చేస్తున్నారు.ఇప్పటి వరకు జగన్ విమర్శించేందుకు పెద్దగా ఏ అవకాశాలు లేకపోవడంతో వీటిని టిడిపి బాగా హైలెట్ చేసుకుంది.

TeluguStop.com - ఎంత పనిచేసావ్ నాని జగన్ కు ఎన్ని ఇబ్బందులో -Political-Telugu Tollywood Photo Image

టిడిపి బిజెపికి మరింత దగ్గరయ్యేందుకు వైసీపీ ప్రభుత్వంపై మతపరమైన విమర్శలకు తెర తీసినట్లు గా కనిపిస్తోంది.

ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన నాని పదే పదే తమపై విమర్శలు చేస్తున్న టిడిపి నాయకులను విమర్శించే క్రమంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

  ఈ వ్యవహారంపై బిజెపి సైతం ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా వెళ్లాల్సి ఉన్నా, జగన్ ఒంటరిగా వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.

ఈ వ్యవహారంపైనా స్పందించిన నాని చంద్రబాబు ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పేరును తెరపైకి తెచ్చారు.

వారు కూడా ఒంటరిగానే వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ప్రధానినీ, ఆదిత్యనాథ్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు అని, రామాలయం శంకుస్థాపన కార్యక్రమానికి మోదీ ఒంటరిగానే హాజరయ్యారు అంటూ నాని గుర్తు చేశారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ని ఈ వ్యవహారంలో కి ఎందుకు లాగాల్సి వచ్చింది అంటూ, బిజెపి నాయకులు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు నాని వ్యాఖ్యలపై కేంద్ర బిజెపి పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఒక వైపు జగన్ బిజెపి పెద్దలకు దగ్గరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే, నాని వాక్యలతో బిజెపి వైసిపి ల మధ్య మరింత దూరం పెంచేలా కనిపిస్తోంది.

అయితే బిజెపి ఎంత ఒత్తిడి తెచ్చినా, నాని విషయంలో మాత్రం జగన్ ఏ చర్యలు తీసుకునేందుకు ఇష్టపడరు అనేది  జగమెరిగిన సత్యం.

#Bjp Leaders #Kodali Nani #Temple Visits #BjpTaget #Narendra Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Taget Ap Minister Kodali Nani Related Telugu News,Photos/Pics,Images..