వైసీపికి వచ్చే ఎన్నికల్లో సీట్ల లెక్క చెప్పిన ”ఎగ్జిట్ పోల్స్”     2017-12-14   22:00:27  IST  Bhanu C

ఒక పార్టీ ఉంటుందా ఊడుతుందా..లేక పార్టీ ఫలానా చోట గెలుస్తుందా లేదా అసలు పార్టీకి ప్రజలలో ఎంత రెస్పాన్స్ ఉంది..ఇలాంటివి అన్ని ప్రజల నాడి తెలుసుకుని కొన్ని కొన్ని సంస్థలు..మీడియా వారు వెల్లడి చేస్తుంటారు..అయితే.ఎవరికీ వారు తమ పార్టీ పరిస్థితి పై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తూ రిపోర్ట్ లు తెప్పించుకుని వ్యూహాలతో ముందుకు వెళ్తుంటారు..ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఒక సంస్థ చేసిన సర్వే చెప్పిన విషయాలు రాజకీయ వర్గాలలో..టిడిపిలో గుబులు రేపుతోంది కూడా..

ఈ మధ్యకాలలో మీడియా ప్రభావం రాజకీయాలపై..ప్రజలపై ఎక్కువగానే ఉంది..రాజకీయనాయకులు మీడియాని చాలా ప్రభావ వంతంగా వాడుకుంటున్నారు. పార్టీల గెలుపు ఓటములు ముందుగానే సర్వేల ద్వారా నిర్నయించేస్తున్నారు…ఇప్పుడు అదే రీతిలో బిజెపి అన్ని రాష్ట్రాలో సర్వే చేయించినట్టుగానే ఏపీలో కూడా చేయించింది అని తెలుస్తోంది.. ముదస్తూ ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపి..టిడిపిలలో ఎవరికి ఎక్కువగా సీట్లు వస్తాయి అంటూ ఆసర్వే సాగింది అయితే ఆ సర్వే తాలూకు నిజాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..అదేమిటంటే

“అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌తో ఇటీవ‌ల బీజేపీ అధిష్టానం దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప‌క‌డ్బందీగా స‌ర్వే చేయించింది. ఓ పేరుమోసిన ఏజెన్సీ ఏపీలో బీజేపీ కోసం ప‌నిచేసింది. ఓట్ల లెక్క‌లు.. గెలుపోట‌ముల అవ‌కాశాల‌పై అత్యంత శాస్ర్తీయంగా ఎంతో క‌ష్ట‌ప‌డి వివ‌రాలు సేక‌రించింది. చాలా ర‌హ‌స్యంగా ఈ స‌ర్వేలు జ‌రిగాయి. ఈ ఫ‌లితాలు చూసి బీజేపీ అధిష్టానం షాక్‌కు గురైంద‌ట‌. వైసీపీకి రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో 120కుపైగా సీట్లు రావ‌చ్చ‌ని, ఏపీలో జ‌నం ప్ర‌భుత్వంపై తీవ్ర‌వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌నే వివ‌రాల‌తో కూడిన ఆ స‌ర్వే నివేదిక‌ను చూసి బీజేపీ ముఖ్య నాయ‌కులు స‌మాలోచ‌న‌ల్లో ప‌డిపోయార‌ని భోగ‌ట్టా. ముంద‌స్తు ఎన్నిక‌లు ఊహించి ఎన్డీటీవీ సైతం చాలా రాష్ర్టాల్లో స‌ర్వేలు చేయిస్తోంది. మ‌న రాష్ట్రంలోనూ ఇప్ప‌టికే ఓ ద‌ఫా స‌ర్వే పూర్త‌యింది. ఆ వివ‌రాలు మీడియాలోని కొంద‌రు ముఖ్యుల వద్ద‌కు చేరాయి. ఈ స‌ర్వేలోనూ టీడీపీకి ఎదురుగాలి బ‌లంగా వీస్తోంద‌ని తేలింది. వైసీపీకి 110 కంటే ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని లెక్క‌లేసి మ‌రీ ఎన్డీటీవీ చెప్పేసింది. ఆ వివ‌రాలు ఇప్పుడు మీడియా వ‌ర్గాల్లో అందుబాటులో ఉన్నాయి.”

ఈ ఇప్పుడు ఈ వార్తే అధికార టిడిపికి చెమటలు పట్టిస్తోంది..అంతేకాదు చంద్రబాబు చేయించుకునే సర్వే లు సైతం ఇదే విషయాన్ని ఓ మోస్తరు అటుఇటుగా వెల్లడించాయని టాక్..దాంతో కంగారు పడిన టిడిపి ఈ సర్వే అంతా తప్పుడు సర్వే..వైసీపి వాళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు అంటూ ప్రచారం చేస్తోంది..అంతేకాదు వీలైనంత ఎక్కువ మంది వైసీపి వాళ్ళని టిడిపిలోకి చేర్చుకుని వైసీపి వచ్చే ఎన్నికల్లో అంత సీన్ లేదు అంటే సంకేతాలు పంపుతోంది..మరి జగన్ టిడిపి వేస్తున్న ఈ ఎత్తులకి ఎలా చెక్ పెడుతారో వేచి చూడాలి. ఏది ఏమైనా సరే వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపికే పట్టం కడుతారు అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్..