కలిసి వస్తున్న ' బండి ' యాత్ర ? అమిత్ షా ఏం చేశారంటే ? 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా ముందుకు వెళుతోంది.మొదట్లో సంజయ్ పాదయత్ర చేపట్టేందుకు ప్రయత్నాలు చేసినా, ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి.

 Bjp Supremacy Over Bandi Sanjay Padayatra Satisfied Bandi Sanjay, Bjp, Telangana-TeluguStop.com

అనేక వాయిదాలు మీద వాయిదాలు పడిన తర్వాత ఎట్టకేలకు పాదయాత్ర వారం రోజుల క్రితం ప్రారంభమైంది.ఈ యాత్ర ద్వారా సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ,  బీజేపీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక ఈ యాత్రకు సంబంధించి వస్తున్న ఆదరణ,  మారుతున్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయి.సంజయ్ పాదయాత్ర ద్వారా బిజెపి గ్రాఫ్ పెరిగింది అనే విషయాన్ని బీజేపీ హైకమాండ్ సైతం గుర్తించింది.
        ఇప్పటికే సంజయ్ పాదయాత్ర కు సంబంధించి ప్రత్యేక టీమ్ ను హైదరాబాద్ కు పంపించడం , వారంతా ఈ యాత్ర ను పర్యవేక్షిస్తూ ఉండడం తో పాటు,  ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ,  అమిత్ షా కి పంపుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవంగా సంజయ్ పాదయాత్ర మొదలు కాకముందే అమిత్ షా టీమ్  హైదరాబాద్ కు రావడం,  యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై పరిశీలన చేయడం వంటివి జరిగాయి.

మొత్తం ఆరుగురు సభ్యుల టీమ్ ఈ యాత్రను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ నివేదికలు పంపుతున్నాయి.అలాగే సంజయ్ యాత్రకు హైప్ తీసుకువచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు.
   

Telugu Bandi Sanjay, Bjp, Huzurabad, Jp Nadda, Telangana, Trs-Telugu Political N

    దీనిలో భాగంగానే కేంద్ర మంత్రులను ఒక్కొక్కరిని ఈ యాత్రలో పాల్గొనే విధంగా షెడ్యూల్ సైతం రూపొందించారు.అలాగే ఈనెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినాన్ని పురస్కరించుకుని బిజెపి నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు.ఈ విధంగా సంజయ్  యాత్రకు హైప్ తీసుకువచ్చేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇదే సమయంలో బిజెపిలో వర్గ పోరు పై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది.

ఎక్కడా ఈ తరహా విభేదాలు తలెత్తకుండా, ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ,  ఈ యాత్రకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉండడం వంటి వ్యవహారాలు సంజయ్ యాత్రకు మరింత ఉత్సాహాన్ని తీసుకు వస్తున్నాయి. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube