బండి కాళ్లకు బ్రేక్ వేసిన బీజేపీ అధిష్టానం...

రెండడుగులు వెనక్కి.ఒక అడుగు ముందుకు అన్న చందగా రాష్ర్టంలో బీజేపీ పార్టీ పరిస్థితి తయారైంది.

 Bjp Supremacy Breaks Cart Legs-TeluguStop.com

అసలే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మైలేజ్ తెచ్చుకోవడం శక్తికి మించిన పని అందరూ భావిస్తుంటే బీజేపీ మాత్రం వేరేలా ఆలోచిస్తోంది.పాదయాత్ర చేయాలన్న రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కాళ్లకు అధినాయకత్వం కళ్లెం వేసినట్లు వినిపిస్తోంది.

ఇందుకు బీజేపీలో ఉన్న గ్రూపులే కారణమని అందరూ భావిస్తున్నారు.బీజేపీ నాయకులు మాత్రం తమలో గ్రూపులు లేవని తామంతా కలిసే ఉన్నామని చెబుతున్నారు.

 Bjp Supremacy Breaks Cart Legs-బండి కాళ్లకు బ్రేక్ వేసిన బీజేపీ అధిష్టానం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇది మాత్రం నిజం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి స్వయాన ముఖ్యమంత్రి కూతురునే ఎంపీ ఎన్నికల్లో ఓడించి వారెవ్వా అని అందరూ అనేలా చేసింది.

అటు తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతలా ప్రభావం చూపలేకపోయినప్పటికీ దుబ్బాక ఉప ఎన్నికలో మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అధికార టీఆర్ఎస్ ను ఓడించారు.అలాగే అటు తర్వాత వచ్చిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటారు.

దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని కమలనాథులు ప్రకటించుకున్నారు.అయితే ప్రస్తుతం జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు .ఎటు చేసి 2023లో అధికార టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.అందుకోసమే రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్ చేస్తూ.

రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.ఈ నెల 9 వ తేదీ నుంచి పాదయాత్ర మొదలవుతుందని కూడా ప్రకటించారు.

కానీ ఆ పార్టీకి అంతలోనే షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది.అధినాయకత్వం బండి పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని పలువురు చర్చించుకుంటున్నారు.

#Bandi Sanjay #BJPSupremacy #Huzurabad #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు