జగన్ కు బీజేపీ మద్దతు ? శాసనమండలి రద్దుకు ఒకే ?

మొదటి నుంచి పడుతున్న అనుమానం ఇప్పుడిప్పుడే నిజమవుతున్నట్టుగా కనిపిస్తోంది.మూడు రాజధానులు, శాసన మండలి రద్దు ఇలా సంచలన నిర్ణయాలతో రాజకీయ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తూ ప్రజలకు షాకులు ఇస్తూ జగన్ ప్రభుత్వం ఏ విషయంలో వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తోంది.

 Bjp Support To Jagan Ok For Dissolution Of The Ap Legislature-TeluguStop.com

ఈ సమయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకునేందుకు జగన్ ఇష్ట పడడం లేదు.అయితే ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు మొదటి నుంచి మౌనంగా ఉండటంతో జగన్ కు వారి మద్దతు ఉందని, అందుకే ఈ విధంగా జగన్ దూసుకెళ్తున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఇదే సమయంలో జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించే జనసేన అధినేత పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, బిజెపి జనసేన కలిసి జగన్ ఇబ్బందులు పెడతాయని అంతా ఒక అంచనాకు వచ్చారు.

Telugu Apcm, Bjpjanasena, Bjpjagan, Jagannarendra, Janasenapawan-Political

ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి బిజెపి మరింత సైలెంట్ అయిపోయింది.ఈ అంశం తమ పరిధిలోని కాదు అంటూ క్లారిటీగా చెప్పేసింది.అంతేకాకుండా జనసేన బిజెపి ఆధ్వర్యంలో తలపెట్టిన లాంగ్ మార్చ్ ను కూడా సుదీర్ఘంగా వాయిదా వేసింది బీజేపీ.

శాసన మండలి రద్దుపైనా అదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.దీనిలో భాగంగానే బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు.ఏపీ శాసనమండలి రద్దుచేయడం పై కేంద్రం సానుకూలంగానే ఉందని, త్వరలోనే రద్దు ప్రక్రియ పూర్తవుతుంది అన్నట్టుగా జివిఎల్ కామెంట్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చేసిన శాసన మండలి రద్దు తీర్మానం బిజెపి నేతలు తాజాగా జీవీఎల్ ఓ మీడియాతో మాట్లాడుతూ మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడడం లేదని, రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రక్రియను బిజెపి ప్రభుత్వం ముందుకు తీసుకెళుతున్న అంటూ వ్యాఖ్యానించారు.

Telugu Apcm, Bjpjanasena, Bjpjagan, Jagannarendra, Janasenapawan-Political

ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.నిబంధనల ప్రకారమే తాము నిర్ణయం తీసుకుంటామన్నారు.అయితే ప్రస్తుతం బడ్జెట్ కు సంబంధించిన హడావుడి ఉన్న నేపథ్యంలో శాసన మండలి రద్దు బిల్లు కాస్త ఆలస్యం జరగవచ్చని, తాము త్వరగా నిర్ణయం తీసుకున్నా న్యాయశాఖ పరిశీలన, క్యాబినెట్లో చర్చించడం, బిల్లు తయారు చేయడం, దానిని పార్లమెంట్ రాజ్యసభ ఆమోదించిన ఆ తర్వాత రాష్ట్రపతికి చేరడం, ఆయన ఆమోదించడం ఎలా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.మొత్తంగా జగన్ తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉందని బీజేపీ పరోక్షంగా ఒప్పుకుంటోంది.

అయితే ఈ పరిణామాలు జనసేనలో కలవరం పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube