దిక్కుతోచని స్థితిలో బీజేపీ...డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికో

కేంద్రంలో అతి భారీ మెజారిటీ తో ప్రభుత్వాన్ని స్థాపించిన బీజేపీ పార్టీ కి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి కి ఎవరిని ఎన్నుకోవాలి అన్న దానిపై తర్జన భర్జన పడుతుంది.డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కావాలంటే తమకు కావాలని అటు శివసేన, ఇటు బిజూ జనతాదళ్ పట్టుబడుతుండటంతో బీజేపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

 Bjp Still Confused About Deputy Speaker Post-TeluguStop.com

ఎన్డీయే కూటమి లో బీజేపీ పార్టీ తరువాత మాదే పెద్ద పార్టీ అని,కాబట్టి తమకే లోక్ సభ డిప్యూటీ స్పీఎకర్ పదవి ఇవ్వాలంటూ శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే కోరుతుండగా, మరోపక్క డిప్యూటీ స్పీకర్ పదవి బీజేడీ కి కేటాయిస్తే బయట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కి మద్దతు ఇస్తామంటూ ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కోరుతున్నారు.దీనితో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచని స్థితిలో బీజేపీ నిలిచింది.

ఎన్డీయే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పట్లో రెండో పెద్ద పార్టీ అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినట్లే ఈసారి తమకు ఇవ్వాలని థాక్రే డిమాండ్ చేస్తున్నారు.మరోపక్క మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా ఈ ఏడాది చివరలో ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో శివసేన తో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే మహారాష్ట్ర లో శివసేన,బీజేపీ కలిసి పోటీ చేసిన కారణంగా ఇప్పుడు ఈ డిప్యూటీ స్పీకర్ పదవి గనుక శివసేనకు కేటయించకపోతే ఆ ఎఫెక్ట్ మహారాష్ట్ర ఎన్నికల పై పడుతుంది అని బీజేపీ ఆలోచనలో పడింది.

-Telugu Political News

అటు ఒడిషాలో అధికారంలోకి రావటంతోపాటు 13 లోక్‌సభ సీట్లు గెలుచుకున్న బీజేడీ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని కోరుతోంది.శివసేనకు మంత్రివర్గంలో మరో క్యాబినెట్ పదవి ఇవ్వటం ద్వారా శాంతింపజేసి తమకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తథాగత సత్పథిని డిప్యూటీ స్పీకర్‌గా నియమిస్తే బాగుంటుంది అని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.అయితే శివసేన అధినాయకత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తుంది.

దీనితో బీజేపీ పార్టీ అధిష్టానం ఈ పదవి కోసం ఎవరిని ఎన్నుకోవాలి అంటూ తలలు పట్టుకొని కూర్చుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube