ఏపీ బీజేపీలో హాట్ టాపిక్‌... సోము కంటే క‌న్నాయే సేఫా...!

ఏపీ బీజేపీలో ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.గ‌తంలో బీజేపీ సార‌థిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణే బెట‌రా? .ఇప్పుడున్న సోము ఆ రేంజ్‌లో క‌లివిడిగా ఉండ‌లేక పోతున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.పార్టీ సార‌థిగా ఎవ‌రు ప‌గ్గాలు చేప‌ట్టినా.

 Bjp Somu Veerraju Kanna Laxmi Narayana Ap-TeluguStop.com

వారి ల‌క్ష్యం పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డ‌మే.అయితే, ఈ విష‌యంలో అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం అనే సూత్రం ఒక‌టి ఉంటుంది క‌దా?!  ఇదే క‌దా.ఏ పార్టీకైనా కీల‌క మంత్రం.అయితే.సోము వీర్రాజు బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.క‌లుపుకొని పోవ‌డం అటుంచి.

సొంత పార్టీ నేత‌ల‌తోనే క‌య్యానికి సిద్ధ‌మ‌వుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

 Bjp Somu Veerraju Kanna Laxmi Narayana Ap-ఏపీ బీజేపీలో హాట్ టాపిక్‌… సోము కంటే క‌న్నాయే సేఫా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవ‌రినీ స్వేచ్ఛ‌గా మాట్లాడ‌నిచ్చే ప‌రిస్థితి లేకుండా చేశార‌ని సోముపై పెద్ద ఆరోప‌ణే ఇప్పుడు ఏపీ బీజేపీ వ‌ర్గాల్లో హ‌ల్‌చల్ చేస్తోంది.

నిజానికి రాజ‌కీయాలంటేనే ఒక‌ట‌న‌డం.రెండు అనిపించుకోవ‌డం… అయితే, ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీకి అంతో ఇంతో మౌత్ పీస్‌లుగా ఉన్న నేత‌ల‌కు సోము అడ్డుక‌ట్ట వేశారు.

కేవ‌లం త‌న వారు మాత్ర‌మే మాట్లాడాల‌ని అనుకున్నారో.ఏమో.లంకా దిన‌క‌ర్‌.స‌హా అనేక మంది వాయిస్ ఉన్న వారిపై వేటు వేశారు.

పార్టీలైన్‌కు భిన్నంగా వెళ్తున్నారంటూ.వారిపై స‌స్పెన్ష‌న్ కొర‌డా ఝ‌ళిపించారు.

ఇది పార్టీలో పైకి గంభీరంగా ఉన్న‌ప్ప‌టికీ.అంత‌ర్గ‌తంగా మాత్రం సోము వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక‌, మ‌న‌కెందుకులే అనుకున్నారో.ఏమో.వెంక‌య్య వ‌ర్గంగా ఉన్న కామినేని శ్రీనివాస‌రావు, గోక‌రాజు గంగ‌రాజు వంటి వారు కూడా మౌనం పాటిస్తున్నారు.ఇక‌, మాజీ మంత్రి పురందేశ్వ‌రి వంటివారు గ‌తంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ హ‌యాంలో బాగానే వాయిస్ వినిపించేవారు.

ఇక‌, ఇప్పుడు ఆమె కూడా మౌనంగానే ఉంటున్నారు.కేంద్రంలో జాతీయ స్థాయి ప‌ద‌వి రావ‌డం ఆశించ ‌ద‌గ్గ‌దే అయిన‌ప్ప‌టికీ.

ఏపీలో మౌనం వెనుక సోము వైఖ‌రితో ఆమె పొస‌గ‌లేక పోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది.దీంతో అనేక మంది నాయ‌కులు త‌మ ఊసు కూడా క‌నిపించ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే, ఇది ఏపీ బీజేపీకి పెను శాపం అవుతుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం.

సోము వీర్రాజుకు వ్య‌క్తిగ‌తంగా ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం ఉంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే, ఆయ‌న బీజేపీకి వెన్నెముక‌గా మారాల్సింది పోయి.ఉన్న వెన్నెముక‌ల‌ను ఊడ‌బెరుక్కుంటున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యానికి గురి చేస్తోంది.

#Political Heat #Andhra Pradesh #KannaLakshmi #Political War #Somu Veeraraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు