సీమ‌పై బీజేపీ వ్యూహం.. కీల‌క నేత‌ల‌కు వ‌ల‌..!

ఏపీలో ఎద‌గాలి.అధికారంలోకి రావాలి.

 Bjp Sketch To Catch Rayalaseema Leaders, Bjp, Sketch, Catch, Rayalaseema, Leader-TeluguStop.com

అని లక్ష్యాలు పెట్టుకున్న బీజేపీ నేత‌లు ఆదిశ‌గా అడుగులు వేయ‌డం ప్రారంభించారు.అయితే.

ఆది నుంచి వ్య‌వ‌స్థ‌ల‌ను చిన్న‌వి చేయ‌డం ద్వారా పుంజుకోవాల‌నే సిద్ధాంతానికి అల‌వాటు ప‌డిన బీజేపీ నేత‌లు.ఏపీ లోనూ అదే సూత్రాన్ని అవ‌లంభిస్తున్నారు.

రాష్ట్రంలో 13 జిల్లాల ప‌రిస్థితిని చూస్తే.ఉభ‌య గోదావ‌రి, కోస్తా, ఉత్త‌రాంధ్ర కంటే.

రాయ‌ల‌సీమ‌లోని మూడు జిల్లాల్లో బీజేపీకి ఎదిగేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంద‌ని నాయ‌కులు గుర్తించారు.అంటే.

ఇక్క‌డ ఎక్కువ మంది సీనియ‌ర్లు.త్రిశంకు స్వ‌ర్గంలో ఉన్నారు.గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి వ‌చ్చిన వారు.

2014లో ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ సైకిల్ ఎక్కిన‌వారు.ఉన్నారు.అయితే.వీరంతా కూడా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టికెట్లు పొందినా.ఓడిపోయారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీకి దూరంగా ఉన్నారు.మ‌రికొంద‌రు వైసీపీ నుంచి వ‌చ్చి.

తిరిగి వైసీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నా.ఫ‌లించ‌క‌.

మంచి అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు.దీనికితోడు.

ఆర్థికంగా.బ‌లంగా ఉన్న నాయ‌కులు సీమ జిల్లాల్లోనే బీజేపీకి ఎక్కువ‌గా ఉన్నారు.

రాజ్య‌స‌భ స‌భ్యులు సీఎం ర‌మేష్‌, టీజీ వెంక‌టేష్ వంటి వారితోపాటు.క‌డ‌ప‌లో ఆది నారాయ‌ణ‌రెడ్డి, అనంత‌పురంలో వ‌ర‌దాపురం సూరి.

ఇలా అనేక మంది ఉన్నారు.సో.ఇంకో కొంత మందిని లాగేస్తే.త‌మ‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని బీజేపీ నేత‌ల అంచ‌నా.!

Telugu Districts, Ap Cm, Bjp, Chance, Chitoor, Rayalaseema, Sketch, Tdp, Ys Jaga

ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా అనంత‌పై నేత‌లు దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది.టీడీపీ నాయ‌కులు.జేసీ దివాక‌ర్ రెడ్డి కుటుంబాన్ని గుండుగుత్తుగా పార్టీలోకి చేర్చుకునేందుకు నాయ‌కులు పావులు క‌దుపుతున్నారు.జేసీకి బ‌ల‌మైన వ‌ర్గం ఉండ‌డంతోపాటు.ఆయ‌న కుమారులు యువ నేత‌లుగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.మ‌రోవైపు.

జ‌గ‌న్ నుంచి ఎదుర‌వుతున్న ఒత్తిళ్లు.ప‌రాభ‌వాల నేప‌థ్యంలో ఈ కుటుంబం కూడా పార్టీ మారేందుకు రెడీగానే ఉంది.

 రాజ్య‌స‌భ సీటును ఆశిస్తున్న జేసీ దివాక‌ర్‌రెడ్డి విష‌య‌మే ఎటూ తేల‌డం లేద‌ని అంటున్నారు పరిశీల‌కులు.

ఇక‌, క‌ర్నూలులో కోట్ల కుటుంబానికి కూడా బీజేపీ ఆఫ‌ర్ ఇస్తాన‌ని అంటున్న‌ట్టు స‌మాచారం.

చిత్తూరులోనూ టీడీపీ నాయ‌కుల‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.అయితే.

ఎవ‌రూ వ‌చ్చేందుకు సిద్ధంగా లేక పోవ‌డంతో రెండు జిల్లాల‌పై ప్ర‌ధానంగా ఫోక‌స్ చేస్తున్నార‌ని అంటున్నారు.మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube