టీడీపీ ని దెబ్బకొట్టడానికి బీజేపీ కుట్ర..? వైసీపీ జనసేనలతో స్కెచ్ !

ఏపీలో బలంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టేందుకు బీజేపీ అనేక ఎత్తులు.పైఎత్తులు వేస్తోంది.

 Bjp Sketch On Tdp With Ysp And Jansena-TeluguStop.com

ఏదో రకంగా టీడీపీని దెబ్బకొట్టి ఏపీలో పాతుకుపోవాలని చూస్తోంది.అయితే అందుకు తగ్గ బలం ఆ పార్టీకి లేనందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలను దగ్గరకు చేరదీసి వాళ్ళ ద్వారా టీడీపీ ని బలహీనపరచాలని చూస్తోంది.

అందుకే బీజేపీ ముఖ్యం గా మూడు ప్లాన్స్ తో ముందుకు వచ్చింది.ఒకటి జగన్ పవన్ లని కలిపి ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్ళటం , రెండు వైసీపీతో పొత్తు పెట్టుకోవటం, మూడు అవినీతి వైసీపీ ని పూర్తిగా పక్కన పెట్టి జనసేనని దగ్గర చేసుకోటం వంటి ప్లాన్లు బీజేపీ వేస్తోంది.

అయితే జగన్ పక్కనపెట్టే కంటే… పవన్ ని జగన్ కలిపి రెడ్డి కాపు సామాజిక వర్గ ఓట్లు దగ్గర చేసుకుంటే విజయం సులువు అని భావిస్తున్నట్టు గ వార్తలు వస్తున్నాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓనమాలు దిద్దటం మొదలుపెట్టారు.ఉత్తరాంధ్ర నుంచి ఆయన తన రాజకీయ యాత్ర మొదలుపెట్టారు.అయితే ఇక్కడ ఆయన వ్యూహం ఏంటి అనేది చాలా మందిలో ఒక ఆసక్తికర చర్చకు తెరతీసింది.ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తన ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ నేపధ్యంలోనే ఆయన అక్కడి నుంచి తన పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు.

అయితే ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక్కడ జగన్ పార్టీతో పవన్ పార్టీ బిజెపి ఆదేశాల అనుసారం పొత్తు పెట్టుకుంది అనే అభిప్రాయం వినపడుతుంది.

తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో బలంగా ఉన్న సంగతి తెలిసిందే.తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్న కొన్ని సామాజిక వర్గాలని ఆ పార్టీకి దూరం చేయటమే లక్ష్యంగా పవన్ యాత్ర సాగుతున్నట్లు తెలుస్తుంది.

ఇక్కడ తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి గాను బీజేపీ ప్రయత్నాలు చేసింది .తమకు ఇక్కడ ఓటు బ్యాంకు లేదని గ్రహించిన ఆ పార్టీ వీరి ద్వారా ప్రయత్నాలు చేస్తుంది.అందుకే పవన్ ముందు నుంచి దృష్టి సారించిన ఉత్తరాంధ్ర నుంచి యాత్ర మొదలుపెట్టారని తెలుస్తోంది.

ఇక్కడ వైకాపా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన బలమైన అభ్యర్ధులను నిలబెట్టి జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైకాపా బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టడం ద్వారా వీరి మధ్య అంతర్గత పొత్తు బీజేపీ కుదిర్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని దూరం చెయ్యడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన బిజెపి, తిరుమల వ్యవహారం ద్వారా బ్రాహ్మణులను టిడిపికి దూరం చెయ్యాలని భావిస్తుంది.

ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా అక్కడి ప్రజల మధ్య మతాల అడ్డుగోడలు పెంచి, రాజకీయ అస్థిరత సృష్టించి, తద్వారా తన ప్రాభల్యం పెంచుకునే అలవాటు ఉన్న ఒక జాతీయ రాజకీయ పార్టీ చేతిలో వైకాపా, జనసేన తొత్తులుగా మారాయి అని ప్రజలు భావిస్తున్నారు.

బీజేపీ ఏపీలో ఎన్ని కుట్రలు చేసినా సరే టీడీపీ విజయాన్ని ఆపలేవని బీజేపీ కుట్రలు ప్రజలు తిప్పికొడతారని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube