నాగార్జున సాగర్ లో ఓటమి చెందితే గత స్థాయికి బీజేపీ?

తెలంగాణలో మొదటి దశ ఎన్నికల వరకు తెలంగాణలో అసలు బీజేపీ అనేది లేనే లేదు.క్యాడర్ లేరు.

 Bjp Situation Nagarjuna Sagar By Polls-TeluguStop.com

గట్టి నాయకులు లేరు.సమర్థవంతమైన నాయకత్వం లేరు.

కాని రెండో దఫా ఎన్నికలు అయిపోయిన తరువాత ఒక్కసారిగా బీజేపీ ఉవ్వెత్తున ఎగసి పడింది.బీజేపీ ఇంత బలంగా ఎలా తయారయిందని రాజకీయ విశ్లేషకులే అభిప్రాయపడ్డారంటే బీజేపీ చాప క్రింద నీరులా క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం చేపడుతూ నియోజకవర్గ స్థాయిలో బలపడేందుకు వేసిన వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెప్పవచ్చు.

 Bjp Situation Nagarjuna Sagar By Polls-నాగార్జున సాగర్ లో ఓటమి చెందితే గత స్థాయికి బీజేపీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తరువాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడం, గ్రేటర్ ఎన్నికలో 2 స్థానాల నుండి 40 కి పైగా స్థానాలకు ఎగబాకడంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందనే వాతావరణం ఏర్పడింది.కాని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులు కనీసం పోటీ ఇవ్వకుండా మూడో స్థానంలో నిలిచి ఓడిపోయారు.

ఇక త్వరలో నాగార్జున సాగర్ ఎన్నికలో కూడా ఓడిపోతే మరల బీజేపీ గతంలో ఉన్న స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడి నిరాశలో ఉన్న బీజేపీ నాగార్జున సాగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు.

మరి బీజేపీ పట్ల ప్రజలు మొగ్గుచూపుతారో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

#Telangana #BJP Elections #Trs Party #NagarjunaSagar #Bjp Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు