నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో మౌనంగా బీజేపీ.. వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో చాప క్రింద నీరులా వ్యాపించి ఒక్కసారిగా బలపడి రాజకీయ వర్గాలను షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు.అయితే ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ను ఓడించి దుబ్బాకలో గెలిచి చరిత్ర సృష్టించిన బీజేపీ, తరువాత గ్రేటర్ ఎన్నికలలో కూడా 2సీట్ల నుండి ఎగబాకి నలభై కు పైగా సీట్లను సాధించి తెరాస కు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Bjp Silent On Nagarjuna Sagar Bypoll  Is It Part Of The Strategy, Bjp Party, Ban-TeluguStop.com

అయితే తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు మూడో స్థానంలోనే ఓడిపోయారు.అయితే ఇక త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

అయితే బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన నాటి నుండి బీజేపీ నాగార్జునసాగర్ వైపు దృష్టి సారించడం లేదు సరికదా మౌనం వహిస్తోంది.అయితే ఈ మౌనం వెనుక ఏమైనా వ్యూహం దాగున్నదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ కదలికలను గమనిస్తూ జాగ్రత్తగా అడుగు ముందుకేయాలన్నది బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది.అయితే ఉమ్మడి నల్గొండలో బీజేపీకి క్యాడర్ లేదు.అది కాక నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థిగా ఎస్టీ అభ్యర్థిని ఖరారు చేయడంతో మిగతా నేతలు కారెక్కిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఏది చేసిన ఏదైనా సంచలనం జరిగితే తప్ప బీజేపీ గెలవడం అసాధ్యమనే మాటలు వినిపిస్తున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube