ఆంధ్రజ్యోతికి 'చెప్పు దెబ్బ' ఎఫెక్ట్ ? రివెంజ్ తీర్చుకున్న బీజేపీ ? 

బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ కార్యక్రమంలో అమరావతి వ్యవహారంపై చర్చిస్తున్న సమయంలో అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్ విష్ణువర్ధన్ రెడ్డి పై చెప్పుతో దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.లైవ్ డిబేట్ లో ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో,  క్షణాల్లో ఆ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 Bjp Serious Over Attack On Bjp Ap Vice-president Vishnuvardhan Reddy In Abn Live-TeluguStop.com

లైవ్ డిబేట్  నిర్వహిస్తున్న  ఆ ఛానెల్ యాంకర్ వెంకట కృష్ణ ఈ వ్యవహారంపై పశ్చాతాపం వ్యక్తం చేయడం, మరోసారి ఈ దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను ఛానెల్ డిబేట్ కార్యక్రమాలకు పిలవము అని ప్రకటించడం వంటివి చోటు చేసుకున్నాయి.అయితే అదే ఛానెల్ మరోసారి స్టూడియో కి శ్రీనివాస్ ను పిలిచి ఈ సంఘటనపై అతని వివరణ ప్రచారం చేయడం వంటివి చోటు చేసుకోవడంపై ఏపీ బీజేపీ సీరియస్ అయ్యింది.

ఈ చెప్పు దాడి వ్యవహారంలో సదరు ఛానెల్ తప్పిధమే ఎక్కువ ఉంది అని ఏపీ బీజేపీ అభిప్రాయపడింది.ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ని ఏపీ బీజేపీ శాఖ బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.

అసలు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ దాడి జరిగిన వెంటనే ఘాటుగా స్పందిస్తూ మాట్లాడారు.అప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి అదే ఏబీఎన్ స్టూడియోలో ఉన్నారు.

చెప్పు దాడికి పాల్పడిన శ్రీనివాసరావు పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయించాలని వీర్రాజు అప్పుడే డిమాండ్ చేశారు.ఇక ఏబీఎన్ లో ఆ తర్వాత రోజు శ్రీనివాసరావు ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చిందో మొత్తం ఏబీఎన్ ప్రచారం చేసింది.

అమరావతి ఉద్యమాన్ని కించపరుస్తూ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడడం తోనే ఈ దాడికి పాల్పడినట్లు శ్రీనివాసరావు చెప్పారు.

Telugu Abn Andrajyothi, Abn Live Debet, Amaravathijac, Ap Bjp, Kittu, Somu Veera

అలాగే ఎన్నో అంశాల గురించి శ్రీనివాస్ చెప్పిన మాటలు ఏబీఎన్ ప్రచారం చేసింది.దీనిపై ఏపీ బీజేపీ సీరియస్ అయింది.ఈ వ్యవహారం ఇక్కడితో వదలకూడదు అని, ఇకపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి బహిష్కరించాలని,  ఏ మీడియా సమావేశాలకు సదరు ఛానల్, పత్రికను పిలవకుడదు అని, అలాగే బీజేపీ నాయకులు ఎవరూ ఆ ఛానల్ లో నిర్వహించే డిబేట్ కార్యక్రమాలలో పాల్గొనకూడదని, బీజేపీ కి సంబంధం లేని వారిని తీసుకువచ్చి వారే బీజేపీ ప్రతినిధులుగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కేసులు పెడతామని ఏపీ బిజెపి శాఖ హెచ్చరించింది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ వ్యవహారంపై క్షమాపణ చెప్పే వరకు తాము ఆ ఛానల్, పత్రిక విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తామని ఏపీ బీజేపీ శాఖ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube