ఈట‌ల‌కు క‌లిసిరాని బీజేపీ సీనియ‌ర్లు.. ఇంకెన్నాళ్లు ఒంటరి పోరాటం..!

అసైన్డ్ ల్యాండ్‌ల విషయమై ఆరోపణలు రాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరి ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు.

 Bjp Seniors Who Have Not Mingled Etela Rajender Another Year Of Lone Struggle, B-TeluguStop.com

బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి కరీంనగర్ జిల్లాలో పట్టు లభించిందని, గెలుపు ఖాయమనే వార్తలు జోరందుకున్నాయి.ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా బలపడుతుందని అందరూ అనుకున్నారు.

కానీ, ఈటల రాజేందర్‌కు బీజేపీ పార్టీలోని సీనియర్ల మద్దతు లభించలేదన్న విషయం ఇటీవల కాలంలో బయటపడింది.సీనియర్ నేతల వరుస రాజీనామాలతో ఈ విషయం తేటతెల్లమైంది.

దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీలోని సీనియర్ నేతలు, కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేశారు.ఫలితంగా పార్టీ ఓట్ బ్యాంకు కొంత మేర పెరిగింది.

బలమైన పార్టీగా అవతరించింది బీజేపీ.అయితే, హుజురాబాద్ నియోజకవర్గం విషయంలో అలా జరగలేదు.

బీజేపీ నుంచి హుజురాబాద్ బరిలో ఉండేందుకు గాను ఆ పార్టీలోని సీనియర్లు భావించినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో అనూహ్యంగా ఈటల రాజీనామా, బీజేపీ నుంచి అభ్యర్థిత్వం పార్టీ సీనియర్ నేతలకు నచ్చలేదు.

సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వంటి కీలక నేతలు ఈటల అభ్యర్థిత్వాన్ని బలపర్చలేదు.పార్టీలో ఈటల చేరికకు మందు తనను సంప్రదించలేదని మోత్కుపల్లి మీడియాతో తెలిపారు.

Telugu Bjp Senior, Bjp Seniors, Etala Rajender, Huzurabad, Peddi-Telugu Politica

ఈటలను ఓడించేందుకు గాను తాను ప్రచారం నిర్వహిస్తానని, టీఆర్ఎస్ అభ్యర్థికి హుజురాబాద్‌లో మద్దతు ఇస్తానని ప్రకటించారు.ఇనుగాల పెద్దిరెడ్డి సైతం రాజీనామా బాట పట్టారు.ఈటలను జాయిన్ చేసుకునే ముందర తన అభిప్రాయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.ఇక బీజేపీలో ఉన్న సీనియర్ నేతలైనా ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారా? లేదా? అనేది బై ఎలక్షన్ నోటిఫికేషన్ సీరియస్ ప్రచారంలో తేలనుంది.ఇంకా కొందరు సీనియర్ నేతలు ఈటల చేరికను సమర్థిస్తున్నారా? లేదా ఆయన చేరికతో అసంతృప్తిగా ఉన్నారా? అనేది కొద్ది రోజుల్లో తేలే అవకాశముంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube