ఏకమైన “బీజేపీ సీనియర్స్”...మోడీ కి “మంగళమే”

బీజేపి లో గందరగోళం నెలకొంది.మోడీ పై ఇప్పటి వరకూ ప్రతిపక్షాలు మిత్రపక్షాలు ముప్పేట దాడి చేస్తూ తన నియంత పాలనపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాయి అయితే మోడీ ఇదంతా ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్రగా కొట్టి పడేస్తున్నాడు అయితే ఇప్పటివరకూ ఎటువంటి తప్పు జరిగినా సరే ప్రతిపక్షాలు కుట్ర అని చెప్పుకునే మోడీ పై ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి గళం పెరిగిపోతోంది.

 Bjp Seniors Sketch On Modi And Amith Sha-TeluguStop.com

మోడీ ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు తమ కసి తీర్చుకుందామా అనే ఆలోచనలో అందరూ వేచి చూస్తున్నారు.

.ఇంతకీ మోడీ పై ఎదురు తిరగడానికి సిద్దంగా ఉన్న ఆ బ్యాచ్ ఎవరో కాదు బీజేపి సీనియర్ లీడర్స్.వివరాలలోకి వెళ్తే.

దేశంలో జరుగుతున్న ప్రతీ విషయం మోడీ పై వ్యతిరేక అస్త్రంగా మారిపోతోంది.ఓ వైపు బీజేపీపై కాంగ్రెస్ కత్తులు దూస్తుంటే… మోదీ, షాలకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే సీనియర్లంతా ఒక్కటవ్వుతున్నారు.

అయితే ఇప్పటి వరకూ మాట్లాడని సీనియర్ నేతలు ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా తమ గళం విప్పుతున్నారు అంటే దానికి కారణం ఆరెస్సెస్ .ఎప్పుడైతే ఆరెస్సెస్ మోడీ పై వ్యతిరేకంగా పావులు కదుపుతోందో బీజేపి లో సీనియర్స్ కి ధైర్యం వచ్చింది.

అయితే ఇప్పటి వరకూ మాట్లాడకుండా ఉన్నది కేవలం మోడీ ఎక్కడ మాపై కక్ష సాధింపులు చేస్తాడో అన్న భయంతోనే అంటూ వారు ఇప్పడు మోడీ కి వ్యతిరేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది…అంతేకాదు ఈ సమావేశం జరిగింది కూడా ఎక్కడో కాదు బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే…కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలను ఏ రకంగా ఎదుర్కోవాలనే వ్యూహంతో మొదలైన సమావేశం చివరికి మోడీ ని ఎలా తప్పించాలనే దిశగా సాగిందట.

అసలు పరిస్థితి ఇంతవరకు రావడానికి అసలు కారణం మోదీ, అమిత్ షాలే కారణంగా ఒకరిద్దరు నేతలు నేరుగా సమావేశంలో మాట్లాడటంతో మిగతా నాయకులు కూడా తమ స్వరాన్ని పెంచేశారని తెలుస్తోంది.

మంత్రులెవరూ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని కూడా చర్చలోకి వచ్చిందట.ఇదిలాఉంటే ఇంకొందరు మంత్రులు.ఇకపై మోదీ తీసుకునే అన్ని నిర్ణయాల పై మనం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందాం ఒక వేళ మనకి మోడీ విధానాలు నచ్చని పక్షంలో అందరం వ్యతిరేకత తెలుపుదాం అని చెప్పరట.

అయితే ఈ సమావేశం గురించి తెలుసుకున్న మోడీ షా లు ఇద్దరూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారట.

ఇకపై షా లేకుండా ఎటువంటి సమావేశం అయినా సరే పార్టీ కార్యాలయాల్లో జరగకుండా చూడాలని మోడీ గట్టిగా ఆదేశాలు జరీ చేశారట…మొత్తానికి మోడీ పై వ్యతిరేక గళం వినిపించి మొదటి అడుగు వేయడంలో సీనియర్స్ సక్సెస్ అయ్యినట్టే కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube