మోడీ బండారం బయట పెట్టిన బీజీపీ సీనియర్ నేత! అది జరిగి ఉంటే  

మోడీపై విమర్శల దాడి చేసిన బీజేపీ సీనియర్ నేత.

Bjp Senior Leader Yashwant Sinha Comments On Modi-bjp Senior Leader Yashwant Sinha,comments On Modi,congress Party,lok Sabha Elections

ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణి కారణంగా బీజేపీ పార్టీ సీనియర్స్ కి అతని మీద పీకల్లోతు కోపం ఉంది. పార్టీ ఎదుగుదలలో ఎంతో కృషి చేసిన సీనియర్ లని కనీసం గౌరవించకుండా వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిన మోడీ విధానాలు, ఆలోచనలని బీజేపీ పార్టీలో చాలా మంది తప్పు పడుతున్నారు. ఎల్ కె అద్వానీ ఉక్కు మనిషి, రాజకీయ దురంధరుడు, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడుని మోడీ కనీసం గౌరవించకుండా పక్కన పెట్టడం చాలా మందికి మింగుడు పడటం లేదు...

మోడీ బండారం బయట పెట్టిన బీజీపీ సీనియర్ నేత! అది జరిగి ఉంటే -BJP Senior Leader Yashwant Sinha Comments On Modi

ఈ నేపధ్యంలో బీజేపీ పార్టీకి దూరంగా ఒకప్పటి సీనియర్ నేతలు నేరుగా అతని మీద విమర్శలు చేస్తున్నారు.తాజాగా మాజీ కేంద్రం మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మోడీపై నేరుగా విమర్శలు చేసారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్లకి బాద్యత వహించి మోడీని వాజ్ పేయి రాజీనామా చేయమన్నారని, ఒక వేళా రాజీనామా చేయకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు సైతం వాజ్ పేయి సిద్ధం అయ్యారని అలా జరిగి ఉంటే ఈ రోజు మోడీ ఉండేవారు కాదని అన్నారు.

అప్పట్లో ఎల్ కె అద్వానీ కారణంగా వాజ్ పేయి వెనక్కి తగ్గడంతో మోడీ లాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రధానిగా, బీజేపీ నాయకుడుగా చూడాల్సి వస్తుందని విమర్శించారు. మోడీ పాకిస్తాన్ ని ఎక్కువగా పాయింట్ చేస్తూ ఎన్నికలలో లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేసారు. మొత్తానికి కరుడుగట్టిన బీజేపీ నేత ఇలా మోడీ మీద నేరుగా విమర్శల దాడి చేయడం సార్వత్రిక ఎన్నికలలో మరో సారి సంచలనంగా మారింది.